హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్... యాడ్ రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హాట్ కేకుల్లా టికెట్లు

IND vs PAK: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్... యాడ్ రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హాట్ కేకుల్లా టికెట్లు

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ రేటు ఎంతో తెలుసా?

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ రేటు ఎంతో తెలుసా?

IND vs PAK: మరో రెండు వారాల్లో ఇండియా-పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను స్టార్ స్పోర్ట్స్ క్యాష్ చేసుకునే పనిలో పడింది.

ఇంకా చదవండి ...

  'క్రికెట్ ఆట అన్ని దేశాలు ఆడుతుంటాయి.. కానీ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఒక రేంజ్ ఉంటంది' ఇదేదో సినిమా డైలాగ్ లాగ అనిపించినా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే దాదాపు యుద్దమే. గత కొన్నేళ్లుగా ఇండియా (India) -పాకిస్తాన్ (Pakistan) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు (Bilateral Series)  జరగడం లేదు. కేవలం ఐసీసీ (ICC) ఈవెంట్లలో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. భారత్-పాక్ జట్లు చివరి సారిగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో (ODI World Cup) తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 89 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇరు జట్లు టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) తలపడనున్నాయి. అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులే కాకుండా.. ఎంతో మంది ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను ఐసీసీ అక్టోబర్ 4 నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచింది. అయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు గంటలోపే పూర్తిగా అమ్ముడయ్యాయంటే ఈ మ్యాచ్‌ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  ఇప్పుడు ఈ మ్యాచ్ క్రేజ్‌ను గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ (Star Sports) కూడా సొమ్ము చేసుకుంటున్నది. ఐసీసీ ఈవెంట్ హక్కులు కలిగిన స్టార్ స్పోర్ట్స్ గత కొన్నేళ్లుగా అన్ని ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. టీ20 ప్రసారాలు కూడా అదే బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నది. ఇప్పటికే అన్ని మ్యాచ్‌లకు సరిపడా స్పాన్సర్లను బుక్ చేసింది. వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్‌లో 10 సెకెన్ల యాడ్ రేటు రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేస్తున్నది.


  ముందుగానే మాట్లాడుకున్న రేటుకు బల్క్ యాడ్లు తీసుకుంటున్నది. అయితే ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు మాత్రం వేరే రేట్లు ఫిక్స్ చేసింది. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ ఇవ్వాలంటే రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వెచ్చించాల్సిందే. అంటే మిగతా మ్యాచ్‌ల కంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు డబుల్ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ధరలు భారీగా పెంచినా సరే యాడ్స్ ఇవ్వడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తున్నది.

  IPL 2021 - Play Offs: ఉన్నది ఒకే ఒక స్థానం.. 4 జట్ల పోటీ.. అగ్రస్థానం కోసం మూడు జట్ల పోరాటం.. ఎవరికి దక్కేనో?


  2016 టీ20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించిన సమయంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు 17.3 రేటింగ్ వచ్చింది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, దూరదర్శన్ ప్రసారం చేశాయి. దాదాపు 83 మిలియన్ల మంది ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన మ్యాచ్ అదే. ఇక 2016లో టీ20 వరల్డ్ కప్‌ను టీవీల ద్వారా దాదాపు 73 కోట్ల మంది వీక్షించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గతంలో కంటే అది 114 శాతం ఎక్కువ. 2016 తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగడం ఇదే. దీంతో ఈ టోర్నీకి కూడా భారీ రేటింగ్స్ వస్తాయని స్టార్ స్పోర్ట్స్ భావిస్తున్నది. అందుకే భారీగా రేట్లు పెంచేసింది.

  Babar Azam: టీ20 క్రికెట్‌లో బాబర్ అజమ్ రికార్డు.. ఆ ఇద్దరి స్టార్ క్రికెటర్లను వెనక్కు నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్‌  టీ20 వరల్డ్ కప్ కోసం స్టార్ స్పోర్ట్స్ 14 మంది స్పాన్సర్లను తీసుకున్నది. ఇందులో కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్ హక్కులు దాదాపు రూ. 70 కోట్లకు అమ్మింది. ఇక అసోసియేట్ స్పాన్సర్‌షిప్ రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు చార్జ్ చేశారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్, ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా బ్రాడ్‌కాస్టర్ భారీగా ఆదాయాన్ని పొందనున్నారు.

  Published by:John Kora
  First published:

  Tags: India VS Pakistan, Star sports, T20 World Cup 2021, Team India

  ఉత్తమ కథలు