హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC T20 World Cup 2022 : ఆరంభం కాకముందే రికార్డులను తిరగరాస్తోన్న టి20 ప్రపంచకప్.. భారత్ వర్సెస్ పాక్ తో సహ..

ICC T20 World Cup 2022 : ఆరంభం కాకముందే రికార్డులను తిరగరాస్తోన్న టి20 ప్రపంచకప్.. భారత్ వర్సెస్ పాక్ తో సహ..

PC : TWITTER

PC : TWITTER

ICC T20 World Cup 2022 : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్ (T20 World Cup) కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. అయినప్పటికీ టికెట్ల విషయంలో 2022 టి20 ప్రపంచకప్ కొత్త రికార్డులను నమోదు చేస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ICC T20 World Cup 2022 : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్ (T20 World Cup) కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. అయినప్పటికీ టికెట్ల విషయంలో 2022 టి20 ప్రపంచకప్ కొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన 5 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ (ICC) ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్టోబర్ 23న జరిగే భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచ్ టికెట్లు కూడా ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో అతిపెద్ద స్టేడియం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగే మ్యాచ్ ల కోసం 87 వేల టికెట్లను ఇప్పటికే విక్రయించినట్లు తెలుస్తోంది.

ఈ టోర్నీల్లో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొదట గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్ 12కు ఇప్పటికే 8 జట్లు ర్యాంకింగ్ ఆధారంగా క్వాలిఫై అయ్యాయి. ఇందుల ో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.

ప్రపంచకప్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు 82 దేశాలకు చెందిన అభిమానులు టికెట్లను కొనుగోలు చేసినట్లు ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఐదు లక్షల టికెట్లలో 80 వేల టికెట్లను చిన్నారుల కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. చిన్నారుల టికెట్ ధరను 5 ఆస్ట్రేలియన్ డాలర్లుగా.. పెద్దవారి టికెట్ ధరను 20 ఆస్ట్రేలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు అయితే కేవలం గ్రూప్, సూపర్ 12 దశ టికెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు.

ఇక అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇటీవలె ముగిసిన ఆసియా కప్ 2022లో ఈ రెండు జట్లు వారం వ్యవధిలో రెండు సార్లు తలపడ్డాయి. అయితే ఈ రెండు సార్లు కూడా మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లింది. ఇక ప్రపంచకప్ లోనూ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ థ్రిల్లర్ ను తలపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్ని హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎంసీజీ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. 2021 టి20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తలపడగా.. అప్పుడు భారత్ పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, Hyderabad, ICC, India vs australia, India VS Pakistan, Pat cummins, Rishabh Pant, Rohit sharma, Steve smith, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు