ICC T20 World Cup : మరో ఆరు వారాల్లో ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా (South Africa)లు తమ జట్లను కూడా ప్రకటించింది. ఇంకో వారం రోజుల్లో మిగిలిన జట్లు కూడా తమ టి20 ప్రపంచకప్ జట్లను ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ వరకు చేరుకున్న పాకిస్తాన్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అప్పుడు పాకిస్తాన్ మెంటార్ గా ఆస్ట్రేలియా దిగ్గజం మ్యాథ్యూ హెడన్ వ్యవహరించాడు.
అతడి పనితీరుపై సంతృప్తిగా ఉన్న పాకిస్తాన్ మరోసారి హెడెన్ ను మెంటార్ గా నియమించుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ లోనూ పాకిస్తాన్ మెంటార్ గా హెడెన్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అతడిని మెంటార్ గా నియమిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో హెడెన్ సలహాలు తమకు ఎంతోగానో ఉపయోగపడతాయని పాకిస్తాన్ భావిస్తోంది.
Matthew Hayden returns as team mentor for T20 World Cup More details: https://t.co/ij6ZM0CGcg pic.twitter.com/6N1hHfra1R
— PCB Media (@TheRealPCBMedia) September 9, 2022
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం (సెప్టెంబర్ 11న) న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే తన కెరీర్ లో చివరిదని ఫించ్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియా జట్టుకు ఆడటం నా అదృష్టం. అంతేకాకుండా కెప్టెన్ గా వ్యవహరించడం మరిచిపోలేనిది. నా వన్డే జర్నీలో చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. వన్డే ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులకు, సహచర ప్లేయర్లకు థ్యాంక్స్‘ అంటూ పేర్కొన్నాడు.
ఇక గత కొంతకాలంగా ఫించ్ వన్డేల్లో పెద్దగా రాణించడం లేదు. చివరి 7 ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. గత 12 ఇన్నింగ్స్ ల్లో 7 సార్లు డకౌట్ అయ్యాడు. దాంతో ఫించ్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించేలోపే అతడే గౌరవంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫించ్ టెస్టులకు, టి20లకు అందుబాటులో ఉంటాడు. అయితే టెస్టులకు అతడు ఎంపికవ్వడం సాధ్యమయ్యే విషయం కాదు. దాంతో అతడు కేవలం టి20లకు మాత్రమే అందుబాటులో ఉంటే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Australia, Pakistan, Sri Lanka, T20 World Cup 2022, Team India