హోమ్ /వార్తలు /క్రీడలు /

Pakistan T20 World Cup Squad : ప్రపంచకప్ టీంను ప్రకటించిన పాకిస్తాన్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేశాడు..

Pakistan T20 World Cup Squad : ప్రపంచకప్ టీంను ప్రకటించిన పాకిస్తాన్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేశాడు..

PC : TWITTER

PC : TWITTER

Pakistan T20 World Cup Squad : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు నెలరోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఇప్పటికే భారత్ (India)తో సహా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England), సౌతాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ (Bangladesh) జట్లు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pakistan T20 World Cup Squad : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు నెలరోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఇప్పటికే భారత్ (India)తో సహా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England), సౌతాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ (Bangladesh) జట్లు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి పాకిస్తాన్ (Pakistan) కూడా చేరింది. గురువారం సమావేశమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).. ఈ నెల 20 నుంచి ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే ఏడు మ్యాచ్ ల టి20 సిరీస్ తో పాటు టి20 ప్రపంచకప్ కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం అయిన స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అతడిని ఇంగ్లండ్ తో సిరీస్ కోసం మాత్రం ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ కు కొత్త కుర్రాళ్లు అమీర్ జమీల్, మొహమ్మద్ హారీస్ వంటి ప్లేయర్లు తొలిసారిగి పాకిస్తాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇక ఆసియా కప్ లో దారుణంగా విఫలం అయిన ఫఖర్ జమాన్ ను ఇంగ్లండ్ తో జరిగే టి20 సిరీస్ కు సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయితే టి20 ప్రపంచకప్ కు మాత్రం అతడిని స్టాండ్ బై ప్లేయర్ గా తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్, టి20 ప్రపంచకప్ జట్లకు బాబర్ ఆజమ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. షాదబ్ ఖాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఆసియాకప్ కు దూరమైన హైదర్ అలీ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది.

ఇంగ్లండ్ తో టి20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు :  బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్రర్ అహ్మద్, అసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్, ఖుష్దిల్, హ్యారీస్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, దహాని, మసూద్, ఉస్మాన్ ఖాదిర్

పాకిస్టాన్ టి20 ప్రపంచకప్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్, ఖుష్దిల్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, షాహీన్ అఫ్రిది,  మసూద్, ఉస్మాన్ ఖాదిర్

స్టాండ్ బై

దహాని, ఫఖర్ జమాన్, హ్యారీస్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, Babar Azam, England, India vs australia, India VS Pakistan, India vs South Africa, Pakistan, South Africa, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు