Home /News /sports /

Ind Vs Afg : ఈ మ్యాచులో కూడా టాస్ ఓడిన టీమిండియా.. జట్టులో కీలక మార్పులు..

Ind Vs Afg : ఈ మ్యాచులో కూడా టాస్ ఓడిన టీమిండియా.. జట్టులో కీలక మార్పులు..

Ind Vs Afg

Ind Vs Afg

Ind Vs Afg : ఇప్పుడిక ఇండియాకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండటం మిగిలింది. ఇతర జట్ల జయాపజయాల సంగతెలా ఉన్నా.. కనీస పరువు దక్కించుకోవాలంటే టీమిండియా మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరుగుతున్న కీలక పోరులో గెలవాల్సిందే.

ఇంకా చదవండి ...
    టీ-20 వరల్డ్ కప్ 2021లో ( T20 World Cup 2021) టీమిండియా (Team India) కీలక పోరుకు రెడీ అయింది. వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొంటోంది కోహ్లీసేన. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోవడంతో సెమీఫైనల్స్ ఆశలు ఇండియాకు దాదాపుగా లేనట్టే. ఇప్పుడిక ఇండియాకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండటం మిగిలింది. ఇతర జట్ల జయాపజయాల సంగతెలా ఉన్నా.. కనీస పరువు దక్కించుకోవాలంటే టీమిండియా మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరుగుతున్న కీలక పోరులో గెలవాల్సిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లోనూ కూడా విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడం విశేషం. గత మ్యాచుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్.. ఈ మ్యాచులో మాత్రం ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇక, ఈ మ్యాచులో టీమిండియా రెండు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులో చేరాడు. ఇక, వరుణ్ చక్రవర్తీ ప్లేస్ లో అశ్విన్ కు చోటు దక్కింది.

    భారత్‌ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్‌ టీమ్‌ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించి గ్రూప్‌ టాపర్‌ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. దీంతో మరోసారి టీమిండియాకు టఫ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతుల్లో పరాజయంపాలైన భారత్‌.. అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌ను ఓడిస్తుందా? అనేది కూడా అభిమానుల్లో డౌట్ ను కలిగిస్తోంది.


    ఈ కీలక మ్యాచులో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనింగ్ దిగే అవకాశాలున్నాయి. సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రావడం టీమిండియాకు కలిసివస్తోంది. ఎందుకంటే అతడు స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు.

    అయితే కోహ్లి మరోసారి అశ్విన్‌ను పక్కన పెడితే.. అతడి పట్ల కోహ్లి వైఖరిపై చర్చ తీవ్రమయ్యే అవకాశముంది. కోహ్లీతో పాటు భారత బ్యాట్స్‌మెనంతా ఫామ్‌లోకి రావడం భారత్‌కు చాలా అవసరం. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని జట్టు ఆశిస్తోంది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్‌ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్‌ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్‌ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది.

    ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్‌ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్‌ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్‌ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల 12 ఓవర్లు మ్యాచ్‌ను శాసిస్తాయి. రషీద్‌ ఖాన్, నబీలు సత్తా చాటితే భారత బ్యాటర్లకు అంత సులువు కాదు. మొత్తంగా ఈ టీమ్‌ అంటే తేలికభావం చూపించకుండా భారత్‌ ఆడాల్సి ఉంది.

    తుది జట్లు :

    టీమిండియా : విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా,

    అఫ్గానిస్థాన్‌ : మహమ్మద్ నబీ (కెప్టెన్‌), హజ్రతుల్లా జాజాయ్, షహజాద్, రహ్మానుల్లా, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్ ఖాన్, కరీమ్ జన్నత్, షర్ఫీద్దున్ అష్రఫ్, నవీన్, హామీద్ హసన్‌.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Afghanistan, Rashid Khan, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు