ICC T20 World Cup 2021 : క్రికెట్‌ లవర్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఒకే గ్రూప్‌లో చిరకాల ప్రత్యర్ధులు..

ICC T20 World Cup 2021

ICC T20 World Cup 2021: క్రికెట్ లవర్స్ కు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది కిక్ ఇచ్చే వార్త. యూఏఈ, ఒమాన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ డ్రాను ఐసీసీ విడుదల చేసింది.

  • Share this:
    క్రికెట్ లవర్స్ కు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది కిక్ ఇచ్చే వార్త. యూఏఈ, ఒమాన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ డ్రాను ఐసీసీ విడుదల చేసింది. అనుకున్నట్టుగానే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో రావడంతో 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకి అసలు ముప్పు న్యూజిలాండ్‌తోనే. ఇప్పటికే మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాయి. గ్రూప్‌-1లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా అర్హత సాధించగా, గ్రూప్‌-2లో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాక్‌లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు బరిలో నిలిచాయి.

    ఇక క్వాలిఫయర్స్‌కు సంబంధించిన గ్రూప్‌-ఏలో శ్రీలంక, నమీబియా, నెదర్‌ల్యాండ్స్, ఐర్లాండ్‌ జట్లుండగా, గ్రూప్‌-బీలో ఒమాన్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పాపువా న్యూ గినియా జట్లు పోటీ పడనున్నాయి. క్వాలిఫయర్స్‌ రెండు గ్రూప్‌ల్లోని తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీకి సంబంధించిన తుది షెడ్యూల్‌ను ఐసీసీ మరికొన్ని వారాల్లో ప్రకటించనుంది. క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు ఎక్కువ శాతం ఒమాన్‌ వేదికగా జరగునుండగా, సూపర్‌-12 మ్యాచ్‌లకు దుబాయ్‌, అబుదాబీ, షార్జాలు వేదికలు కానున్నాయి.


    మరోవైపు , ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై భారత జట్టు విజయం సాధించి, 15 ఏళ్లు దాటిపోయింది. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించిన టీమిండియా, 2007 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో పరాజయం పాలైంది. 2019 వన్డే వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియాను సెమీస్‌లో 18 పరుగుల తేడాతో ఓడించిన న్యూజిలాండ్, ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ గెలిచి టైటిల్ గెలిచింది. దీంతో మరోసారి కివీస్ రూపంలో టీమిండియాకు పెద్ద సవాల్ ఎదురుకానుంది.
    Published by:Sridhar Reddy
    First published: