• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC T20 RANKINGS VIRAT KOHLI ROHIT SHARMA MOVE UP IN RANKINGS SA

రాహుల్ దాటేసిన కోహ్లీ.. ఐదో స్ధానానికి పడిపోయిన రాహుల్!

రాహుల్ దాటేసిన కోహ్లీ..  ఐదో స్ధానానికి పడిపోయిన రాహుల్!

virat kohli and rohit sharma

తాజా మ్యాచ్‌లలో విరాట్‌ కోహ్లీ రాణిస్తుండంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ స్థానం మరింత మెరుగైంది. ఐదు స్థానం నుంచి అతను నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు

  • Share this:


    తాజా మ్యాచ్‌లలో విరాట్‌ కోహ్లీ రాణిస్తుండంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ స్థానం మరింత మెరుగైంది. ఐదు స్థానం నుంచి అతను నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 పిరీస్‌లో ఇక టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3 ర్యాంకులు మెరుగై 14వ స్థానంలో నిలిచాడు. టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు.

    మిగితా బ్యాట్స్‌మెన్స్ శ్రేయస్‌ అయ్యర్‌ 26 వ స్థానంలో ఉండగా.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ 66, కీపర్ రిషభ్ పంత్‌ 11 స్థానాలు ఎగబాకి 69 మెరుగైన స్థానంలో నిలిచారు. ఇక బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 21 స్థానాలు ఎగబాకి 24కు చేరుకొగా.. అల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య 47 స్థానాలు మెరుగై 78 స్థానంలో నిలిచాడు. యథావిధిగానే ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాడు డేవిడ్‌ మలన్‌ టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు..
    Published by:Rekulapally Saichand
    First published: