హోమ్ /వార్తలు /క్రీడలు /

Icc t20 rankings: శ్రేయస్ అయ్యర్ జోరు... విరాట్ కోహ్లీ బేజారు

Icc t20 rankings: శ్రేయస్ అయ్యర్ జోరు... విరాట్ కోహ్లీ బేజారు

శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

Icc t20 rankings: టీమిండియా యంగ్ గన్ శ్రేయస్ అయ్యర్ జోరు మీదున్నాడు. శ్రీలంక తో జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన అతడు తన ర్యాంకింగ్ ను కూడా మెరుగు పర్చుకున్నాడు. వివరాల కోసం పూర్తి వార్తను చదవండి

Icc t20 rankings: భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత (India) యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జోరు మీదున్నాడు. టీమిండియా (Team India) రిజర్వ్ బెంచ్ స్థాయి నుంచి మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్ గా మారాడు. ఇటీవల శ్రీలంక (Sri lanka)తో ముగిసిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో కెప్టెన్ రోహాత్ శర్మ (Rohit Sharma) విఫలమైనా... తన ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. మూడు మ్యాచ్ ల్లోనూ వరుస పెట్టి అజేయ అర్థ సెంచరీలతో ఔరా అనిపించాడు. తొలి టి20లో 57 పరుగులు చేస్తే... రెండో టి20లో 74 పరుగులు సాధించాడు. ఇక మూడో టి20లో 73 పరుగులతో మొత్తం 204 పరుగులు చేసి ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‘గా నిలిచాడు. శ్రీలంకపై కనబర్చిన ప్రదర్శనతో తాజాగా ఐసీసీ (ICC) విడుదల చేసిన బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లోనూ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు.

బుధవారం ఐసీసీ విడుదల చేసిన పురుషుల టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ శ్రేయస్ అయ్యర్ బిగ్ జంప్ చేశాడు. ఎక్కడో 45వ స్థానంలో ఉన్న అతడు ఏకంగా 27 స్థానాలు పైకి ఎగబాకి 18వ స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి మాత్రం ర్యాకింగ్స్ ఝలక్ ఇచ్చాయి.  శ్రీలంక ()తో జరిగిన సిరీస్ కు దూరమైన అతడు... ఐదు స్థానాలు కిందికి దిగజారి 15వ స్థానంలో నిలిచాడు. మరో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)కూడా నాలుగు స్థానాలు కిందికి దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతానికైతే టి20 ర్యాంకిగ్స్ లో టాప్ 10లో ఉన్న ఏకైక భారత ప్లేయర్ గా రాహుల్ మాత్రమే ఉన్నాడు. ర్యాంకింగ్స్ లో బాబార్ ఆజమ్ 805 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... మరో పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (South Africa)కు చెందిన మార్కరమ్ నిలిచాడు.

బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్కరికి కూడా టాప్ 10లో చోటు దక్కలేదు. భువనేశ్వర్ కుమార్ 17వ స్థానంలో ఉండగా... జస్ప్రీత్ బుమ్రా 23వ  స్థానంలో నిలిచాడు. టాప్ ర్యాంక్ లో దక్షిణాఫ్రికా బౌలర్ షమ్సీ ఉండగా... రెండో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్ వుడ్... మూడో ర్యాంక్ లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది.

First published:

Tags: ICC, India, KL Rahul, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు