పాకిస్తాన్ తర్వాత భారత్...ఐసీసీ టీ20 ర్యాంక్స్ విడుదల

బౌలింగ్ విభాగంలో చైనామెన్ కుల్దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తప్ప టాప్-10 జాబితాలో భారత బౌలర్లెవరికీ స్థానం లభించలేదు.

news18-telugu
Updated: February 11, 2019, 10:09 PM IST
పాకిస్తాన్ తర్వాత భారత్...ఐసీసీ టీ20 ర్యాంక్స్ విడుదల
టీంఇండియా (Image : Twitter)
news18-telugu
Updated: February 11, 2019, 10:09 PM IST
న్యూజిలాండ్‌పై టీ20 సిరిస్ కోల్పోయిన టీమిండియా టీ20 ర్యాంకిగ్స్‌లో రెండో స్థానానికి పరిమితమైంది. పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో భారత ఆటగాళ్లకు చోటుదక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ మూడు స్థానాలను మెరుగుపరచుకొని ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ పదో స్థానానికి పరిమితం కాగా..శిఖర్ ధావన్ 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. విరాట్ కొహ్లీ 19వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టీట్వంటీ సిరీస్‌లో కొహ్లీకి విశ్రాంతినివ్వడంతో అతడు ర్యాంక్ పడిపోయింది.

ఇక బౌలింగ్ విభాగంలో చైనామెన్ కుల్దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తప్ప టాప్-10 జాబితాలో భారత బౌలర్లెవరికీ స్థానం లభించలేదు. యుజ్వేంద్ర చాహల్ 17వ స్థానం, భువనేశ్వర్ కుమార్ 18వ ర్యాంకులు సాధించారు.

టీ20 జట్టు ర్యాంకింగ్స్

1. పాకిస్తాన్ (రేటింగ్ 135 )


2. ఇండియా ( 124)
3. సౌతాఫ్రికా (118)
4. ఇంగ్లాండ్ (118)
5. ఆస్ట్రేలియా (117)

టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్
1. బాబర్ అజామ్ (పాకిస్తాన్) 855 రేటింగ్
2. కాలిన్ మున్రో (న్యూజిలాండ్) 825
3. అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 806
4. ఎవిన్ లెవిస్ (వెస్టిండీస్) 751
5. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) 745


టీ20 బౌలర్స్ ర్యాంకింగ్స్
1. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్ ) 793 పాయింట్స్
2. కుల్దీప్ యాదవ్ (ఇండియా) 728
3. షదాబ్ ఖాన్ (పాకిస్తాన్) 720
4. ఇమాద్ వసీం (పాకిస్తాన్) 705
5. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) 676
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...