KL Rahul: కోహ్లీని వెనక్కు నెట్టేసిన కేఎల్ రాహుల్...T20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టాప్...

ICC T20 Rankings| న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 224 పరుగులు చేసి టాప్ ప్లేస్ లో నిలిచిన రాహుల్ తన ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్నాడు.

news18-telugu
Updated: February 17, 2020, 6:45 PM IST
KL Rahul: కోహ్లీని వెనక్కు నెట్టేసిన కేఎల్ రాహుల్...T20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టాప్...
కేఎల్ రాహుల్ (Image: ICC)
  • Share this:
ICC ప్రకటించిన వరల్డ్ T20 బ్యాట్స్ మెన్ ర్యాంకుల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 224 పరుగులు చేసి టాప్ ప్లేస్ లో నిలిచిన రాహుల్ తన ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కోహ్లీ ప్లేస్ పదో స్థానానికి పడిపోంది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో వీరిద్దరితోపాటు రోహిత్ శర్మ 9 స్థానంతో టాప్-10 లో ఉన్నాడు. ఇక ర్యాంకింగ్స్‌ పరంగా బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా, రాహుల్, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తర్వాతి , బౌలింగ్, ఆల్ రౌండర్స్ చార్టులలో వరుసగా ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తొలి స్థానాల్లో నిలిచారు. దేశాల వారీగా చూస్తే.. T20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో ప్లేస్ ఉంది. ఇంగ్లండ్ కేవలం రెండు పాయింట్ల తేడాతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా నాలుగో స్థానంలో, సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి.
First published: February 17, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading