హోమ్ /వార్తలు /క్రీడలు /

Ravindra Jadeja : అదరగొట్టిన రవీంద్ర జడేజా.. ఫీల్డింగ్‌లో మెరుపులు

Ravindra Jadeja : అదరగొట్టిన రవీంద్ర జడేజా.. ఫీల్డింగ్‌లో మెరుపులు

ర‌వీంద్ర జ‌డేజా

ర‌వీంద్ర జ‌డేజా

T20 World Cup 2021: అంతర్జాతీయ క్రికెట్‌ (Cricket)లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒకడు. ఈ రోజు జ‌రిగిన అఫ్గ‌నిస్థాన్ (Afghanistan) మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి తాను ఎంత ముఖ్య‌మైన ఫీల్డ‌ర్ అనేది రుజువు చేశాడు.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ (Cricket)లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒకడు. ఆల్‌రౌండ‌ర్ మాత్ర‌మే కాకుండా అత్యుత్తమ ఫీల్డర్ అంటే గుర్తుకొచ్చే పేర్లలో జడేజా కచ్చితంగా ఉంటాడు. ఈ రోజు జ‌రిగిన అఫ్గ‌నిస్థాన్ (Afghanistan) మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి తాను ఎంత ముఖ్య‌మైన ఫీల్డ‌ర్ అనేది రుజువు చేశాడు. బౌండ‌రీ లైన్ (Boundary Line) వ‌ద్ద ర‌న్ చేస్తూ ప‌రులుగుల ఆపినా.. ఆఫ్‌సైడ్‌లో బ్యాట్‌మెన్ ప‌రుగులు తీయ‌కుండా వికెట్ల మీద‌కు బాల్‌ల‌ను విసిరినా.. ప‌రిగెత్తుతూ వ‌చ్చి క్యాచ్‌లు ప‌ట్టినా జ‌డేజాది ప్ర‌త్యేక స్థానం అన‌డంలో సందేహం లేదు. ఈ ఇండియా-అఫ్గ‌నిస్థాన్ మ్యాచ్‌లో కూడా ఫీల్డ్ (Field) అంతా ఎక్క‌డ చూసినా జ‌డేజా క‌నిపించాడ‌న‌డంలో సందేహం లేదు. గ్రౌండ్ అంతా ప‌రుగులు తీస్తూ ఇండియన్ టీమ్‌లో అత్యుత్త‌మ ఫీల్డ‌ర్‌న‌ని నిరూపించుకొన్నాడు.

ఐసీసీ ప్ర‌పంచ టెస్ట్ ఆల్ రౌండ‌ర్ర్యాకింగ్‌లో ర‌వీంద్ర జ‌డేజా 338 పాయింట్ల‌తో మూడు స్థానంలో ఉన్నారు. అటు బ్యాటింగ్‌.. అవ‌స‌ర‌మైనప్పుడు బౌలింగ్‌లో రాణిస్తూ ఫీల్డింగ్‌లో కీ ప్లేయ‌ర్‌గా ఎదిగాడు.

Ind Vs Afg : ఇదే కదా టీమిండియా అంటే..! అఫ్గాన్ పై భారీ తేడాతో గెలిచిన కోహ్లీసేన..


టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా-అఫ్గినిస్థాన్ మ్యాచ్‌లో ఇండియ‌న్ టీం ష‌మీ బౌలింగ్‌లో 18 ఓవ‌ర్ వేసింది. ఈ ఓవ‌ర్ జ‌న‌త్ (JANAT) కొట్టిన బాల్‌ని అద్బుత‌మైన డైవ్‌తో క్యాచ్ అందుకొన్న‌డు. చాలా దూరం నుంచి ప‌రిగెత్తుకొంటూ వ‌చ్చి.. అద్బుత‌మైన టైమింగ్‌తో బాల్‌ను క్యాచ్ ప‌ట్టాడు. క‌నీ తార్డ్ ఎంపైర్ నిర్ణ‌యం మాత్రం అది ఔట్‌గా ప‌రిగ‌ణించ లేదు. కానీ జ‌డేజా ప‌ట్టిన క్యాచ్ క‌చ్చితంగా మ్యాచ్‌కి హైలెట్‌. టైమింగ్‌.. ఫీల్డింగ్‌లో త‌న‌కు ఇండియ‌న్ టీంలో తిరుగ‌లేద‌ని జ‌డేజా మ‌రోసారి రుజువు చేసుకొన్నాడు.

కీల‌క పోరులో విజ‌యం..

కోహ్లీసేన అఫ్గానిస్థాన్ కు చుక్కలు చూపించింది. కీలక పోరులో 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ ను చిత్తు చేసింది టీమిండియా. అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటారు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ ( 32 బంతుల్లో 35 పరుగులు), కరీమ్ జన్నత్ ( 22 బంతుల్లో 42 పరుగులు) రాణించారు. ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి విక్టరీ. ఈ విజయంతో తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది భారత్. ఒక వేళ అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే, టీమిండియా మిగతా రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలవాలి.

First published:

Tags: Cricket, Ravindra Jadeja, T20 World Cup 2021

ఉత్తమ కథలు