ICC SUSPENDED UAE PLAYERS AMIR HAYAT AND ASHFAQ AHMED FOR 8 YEARS UNDER ICC ANTI CORRUPTION CODE SRD
ICC : బుకీల నుంచి ముడుపులు..ఆ ఇద్దరి క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ..
బుకీల నుంచి ముడుపులు..ఆ ఇద్దరి క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ..
ICC : క్రికెట్ అంటే జెంటిల్ మేన్ గేమ్ అంటుంటారు. అయితే ఆ క్రికెట్‌లో అప్పుడప్పుడూ జరిగే ఘటనలు ఈ గేమ్ పట్ల పలు అనుమానాల్ని లేవనెత్తుతాయ్. తాజాగా అలాంటి ఘటనే క్రికెట్ లో చోటు చేసుకుంది.
క్రికెట్ అంటే జెంటిల్ మేన్ గేమ్ అంటుంటారు. అయితే ఆ క్రికెట్‌లో అప్పుడప్పుడూ జరిగే ఘటనలు ఈ గేమ్ పట్ల పలు అనుమానాల్ని లేవనెత్తుతాయ్. తాజాగా అలాంటి ఘటనే క్రికెట్ లో చోటు చేసుకంది. యూఏఈ క్రికెటర్లు అమీర్ హయత్, అష్ఫక్ అహ్మద్ లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. భారత్ కు చెందిన బుకీ నుంచి ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై పూర్తి నిర్ధారణకు వచ్చిన ఐసీసీ... వీరిద్దరిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2019లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ క్వాలిఫయర్ లో వీరు ముడుపులు స్వీకరించారని ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ నిర్ధారించింది. దీంతో, వీరిపై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ ఇద్దరిపై నిషేధపు వేటు పడింది.
వీరిద్దరూ 15 వేల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను బుకీ నుంచి స్వీకరించారని ఐసీసీ నిర్ధారించింది. క్వాలిఫయింగ్ రౌండ్ గేమ్స్ ను ఫిక్స్ చేసేందుకు మిస్టర్ 'వై' అనే వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్నారని విచారణలో తేలింది. వీరిద్దరిలో అహ్మద్ బ్యాట్స్ మెన్ కాగా... హయత్ మీడియం పేస్ బౌలర్. మిస్టర్ వైకి బెట్టింగ్ సిండికేట్లతో లింకులు ఉన్నట్టు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తెలిపింది. ఆయనతో ఈ ఇద్దరు క్రికెటర్లకు వాట్సాప్ మెసేజ్ లు కూడా నడిచాయని చెప్పింది.
ఇప్పటికే..చాలా మంది క్రికెటర్లు ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లఘించి నిషేధానికి గురయ్యారు. జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్, శ్రీలంక క్రికెటర్ జోయసాలు ఇలాంటి నిషేధానికి గురయ్యారు. ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా క్రికెట్ లో అవినీతికి పాల్పడ్డారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.