హోమ్ /వార్తలు /క్రీడలు /

ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్...నెం.1 బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ...

ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్...నెం.1 బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ...

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో మొదటిస్థానంలో ఆక్రమించాడు. అలాగే న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్‌సన్ సైతం 913 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఐసీసీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో మొదటిస్థానంలో ఆక్రమించాడు. అలాగే న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్‌సన్ సైతం 913 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే మరో భారత బ్యాట్స్ మ్యాన్ ఛతేశ్వర్ పుజారా 881 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉండగా, హెన్రీ నికోలస్ ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే టాప్ టెన్ లో డేవిడ్ వార్నర్, జోరూట్, డుప్లెసిస్ కూడా చోటు దక్కించుకున్నారు.

బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమ్మిన్స్ మొదటిస్థానం ఆక్రమించగా, జేమ్స్ అండర్‌సన్ రెండో స్థానం, కగిసో రబడా మూడో స్థానంలో నిలిచారు. టాప్ టెన్ టెస్ట్ బౌలర్లలో రవీంద్ర జడేజాకు ఆరో ర్యాంకు, రవిచంద్రన్ అశ్విన్ 10 ర్యాంకు దక్కించుకున్నారు. ఇక ఆల్ రౌండర్ విభాగంలో జడేజా మూడో ర్యాంకు సాధించగా.. జేసన్ హోల్డర్, షకీబ్ అల్ హసన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

First published:

Tags: Cricket, ICC, ICC Cricket World Cup 2019, Team India, Virat kohli

ఉత్తమ కథలు