news18-telugu
Updated: January 20, 2020, 9:58 PM IST
బెంగళూరు వన్డేలో శతకం సాధించిన రోహిత్ శర్మను అభినందిస్తున్న కోహ్లీ (image: BCCI)
ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీ సేన. బెంగుళూరు వేదికగా జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కోహ్లీ, రోహిత్ శర్మ. తాజా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కోహ్లీ(886 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా...రోహిత్ శర్మ(868 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకోగా...రోహిత్ శర్మ మూడు రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకున్నాడు.
ఆసీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 183 పరుగులు సాధించి కోహ్లీ...ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 171 పరుగులతో రోహిత్ శర్మ రాణించాడు.ఆదివారంనాటి సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో శతకంతో అదరగొట్టాడు రోహిత్ శర్మ(119). పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ 829 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 170 పరుగులతో రాణించిన శిఖర్ థావన్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ ర్యాంకులో నిలిచాడు. కేఎల్ రాహుల్ 21 స్థానాలు మెరుగుపరుచుకుని 50వ ర్యాంకులో నిలిచాడు. అటు ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 764 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Published by:
Janardhan V
First published:
January 20, 2020, 9:55 PM IST