హోమ్ /వార్తలు /sports /

ICC New Rules: ఇక స్లో బోలింగ్ చేస్తే.. బ్యాటింగ్ టీంకు అడ్వాంటేజ్: ఐసీసీ తాజా రూల్స్

ICC New Rules: ఇక స్లో బోలింగ్ చేస్తే.. బ్యాటింగ్ టీంకు అడ్వాంటేజ్: ఐసీసీ తాజా రూల్స్

ICC New Rules | క్రికెట్‌లో రోజు రోజుకు వేగం పెరిగిపోతుంది. ఐసీసీ కూడా ఇందుకు త‌గ్గ‌ట్టు ఎన్నో మార్పులు తీస‌కొస్తుంది. తాజాగా ఐసీసీ టీ20 క్రికెట్‌లో మ‌రిన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఈ ఏడాది జ‌నవ‌రి నుంచే ప్రారంభమవుతాయ‌ని తెలిపింది.

ఇంకా చదవండి ...

  క్రికెట్‌లో రోజు రోజుకు వేగం పెరిగిపోతుంది. ఐసీసీ (ICC) కూడా ఇందుకు త‌గ్గ‌ట్టు ఎన్నో మార్పులు తీస‌కొస్తుంది. తాజాగా ఐసీసీ టీ20 క్రికెట్‌లో మ‌రిన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఈ ఏడాది జ‌నవ‌రి నుంచే ప్రారంభమవుతాయ‌ని తెలిపింది. ఈ ఏడాది త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌య్యే వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జనవరి 16వ తేదీన జరగనున్న మ్యాచ్ నుంచి ఈ మార్పులు అందుబాటులోకి రానున్నాయ‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని Sportskeeda ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ఈ వెబ్‌సూట్ ఈ స్పోర్ట‌స్‌కు సంబంధించింది. ఈ వెబ్‌సైట్‌ను 2009లో ప్రారంభించారు. కొత్త రూల్స్‌లో మొదటి స్లో ఓవర్ రేట్‌కు ఇన్-మ్యాచ్ పెనాల్టీ కాగా.. ఇన్నింగ్స్ మధ్యలో ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ కూడా ఉండనుంది.

  ICC have put forward some new rules for T20I cricket ?

  IPL: ఐపీఎల్‌లో సూప‌ర్ హిట్‌.. త‌రువాత మాయ‌మై ఎక్క‌డికి పోయారు ఈ క్రికెట‌ర్లు!

  కొత్త రూల్స్ ఇవే..

  ఇన్‌గేమ్ స్లో ఓవర్ రేట్ - ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిని కొత్త రూల్స్లో బౌలింగ్ వేసే జట్టు షెడ్యూల్ చేసిన సమయానికి తమ చివరి ఓవర్‌లో మొదటి బంతి వేయాలి. ఒకవేళ ఇందులో విఫలం అయితే.. పెనాల్టీ కింద 30 గజాల సర్కిల్ అవతల అనుమతించిన సంఖ్య కంటే ఒక ఫీల్డర్‌ను తక్కువ పెట్టాలి. స్లో ఓవర్ రేటుకు పడే పెనాల్టీకి ఇది అదనం. ఇది బ్యాటింగ్ చేసే జ‌ట్టుకు అడ్వాంటేజ్ కానుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

  ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ - ఐసీసీ విధించిన రెండో నిబంధన ప్రకారం.. ప్రతి ఇన్నింగ్స్‌కు మధ్యలో ఒక ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ ఉండాల‌ని నిబంధ‌న‌లో పేర్కొంది. ఇది రెండున్నర నిమిషాలు ఉండవచ్చు. అయితే రెండు టీంలు అడే సిరీస్‌లో ఈ నిబంధన ఉండాలంటే.. ఆ రెండు జట్లూ సిరీస్ ప్రారంభానికి ముందే దీనికి ఒప్పందం చేసుకోవాల‌ని సూచించింది. ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తరహాలో ఈ డ్రింక్స్ బ్రేక్ అందుబాటులో ఉండనుంద‌ని ఐసీసీ తెలిపింది.

  ఎల్బీడబ్ల్యూ డీఆర్ఎస్ - ఐసీసీ 2021 ఏప్రిల్‌లో ఐసీసీ దీనికి మార్పులు చేసింది. బంతిలో 50 శాతం బెయిల్స్‌కు తగిలినప్పుడు దాన్ని ఎల్బీడబ్ల్యూగా పరిగణించాలని ఐసీసీ ఇప్ప‌టికే నిర్ణయించింది. పాత రూల్ ప్రకారం.. బంతి బెయిల్స్‌కు తగిలినా.. అది అంపైర్స్ కాల్‌గానే పరిగణించేవారు. ఈ చిన్న టెక్నికల్ మార్పు బౌలర్లకు వరంగా మారింది. ఎక్కువ‌గా బ్యాటింగ్ ఫేవ‌ర్‌గా మారుతున్న టీ20లో బౌల‌ర్ల‌కు అవ‌కాశాలు క‌ల్పించేలా ఈ రూల్ ఉంద‌ని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

  టెస్టు చాంపియన్ షిప్ 2021-23లో..

  టీ20తో పాటు ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్ షిప్‌లోనూ మార్పులు తీసుకొచ్చింది. 2021-23 కొత్త సైకిల్‌లో ఐసీసీ ఆధ్వ‌ర్యంలో జరిగే ప్రతి మ్యాచ్‌కు డబ్ల్యూటీసీ పాయింట్లను అందించనుంది. గతంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయినా కూడా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయినా 120 పాయింట్లే వచ్చేవి. తాజాగా ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్ర‌కారం ఐసీసీ పాయింట్ల ప్రక్రియను మరింత సులభం చేసింది. ఇప్పుడు జట్లు తాము ఆడిన మ్యాచ్‌ల్లో విజయాల ఆధారంగా పాయింట్ల పర్సంటేజ్‌ను పొందనున్నాయి. దీని ఆధారంగా ర్యాంకింగ్స్ నిర్ణయించనున్నారు.

  First published:

  ఉత్తమ కథలు