హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : ఇకపై ఫీల్డర్ అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. స్పష్టం చేసిన ఐసీసీ

IND vs AUS : ఇకపై ఫీల్డర్ అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. స్పష్టం చేసిన ఐసీసీ

ఐసీసీ లోగో (ఫైల్ ఫోటో)

ఐసీసీ లోగో (ఫైల్ ఫోటో)

IND vs AUS 1st T20: వచ్చే నెల అక్టోబర్ (October)లో జరిగే టి20 ప్రపంచకప్ (T20 World Cup) కొత్త రూల్స్ తో జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).. అక్టోబర్ 1 నుంచి క్రికెట్ లో కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 1st T20: వచ్చే నెల అక్టోబర్ (October)లో జరిగే టి20 ప్రపంచకప్ (T20 World Cup) కొత్త రూల్స్ తో జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).. అక్టోబర్ 1 నుంచి క్రికెట్ లో కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త రూల్స్ లో మన్కడింగ్, కొత్త బ్యాటర్ స్ట్రయికింగ్ అంశాలు ఉన్నాయి. క్రికెట్ చట్టాలను చేసే లండన్ లోని మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) ఇది వరకే ఈ చట్టాలను చేయగా.. వీటిని ఐసీసీ ఆమెదించింది. అయితే క్రికెట్ లో మాత్రం ఇంకా ప్రవేశపెట్టలేదు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ ను క్రికెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. దాంతో వచ్చే టి20 ప్రపంచకప్ లో మనం ఈ కొత్త రూల్స్ ను చూసే అవకాశం ఉంది.

మన్కడింగ్ కూడా

ఐపీఎల్ లో జాస్ బట్లర్ ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన సంగతి గుర్తుంటే ఉంటుంది. అప్పట్లో ఈ విషయం భారీ వివాదానికే తెర లేపింది. అశ్విన్ క్రీడా స్పూర్తిని తుంగలో తొక్కాడంటూ విదేశీ క్రికెటర్లు రచ్చ చేశారు కూడా. అయితే మన్కడింగ్ ను రనౌట్ గా పరిగణిస్తూ మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ చట్టం చేసింది. ఇకపై మన్కడింగ్ ను రనౌట్ లా మాత్రమే చూడాలంటూ  అదేమి క్రీడాస్పూర్తికి విరుద్దం కాదంటూ మెరిల్ బోర్న్ తెలిపింది. అనంతరం ఐసీసీ కూడా ఆ చట్టాన్ని ఆమోదించింది.

కొత్త రూల్స్ ఇవే

1. మన్కడింగ్ ను రనౌట్ గా గుర్తించనున్నారు. ఇప్పటికే దీనిని ఐపీఎల్ తో పాటు ఇతర లీగ్ లలో అమలు చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

2. కొత్త బ్యాటర్ స్ట్రయికింగ్ తీసుకోవడం. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్యాచ్ అవుట్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ సగం పిచ్ దాటితే అతడు ఆ తర్వాతి బంతిని ఎదుర్కొనే అవకాశం ఉండేది. అయితే అక్టోబర్ 1 నుంచి అలా జరగదు. క్యాచ్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటరే స్ట్రయికింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్ ను ఈ ఏడాది ఐపీఎల్ లో పాటించాం కూడా. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

3. ఉమ్మి రాయడం పూర్తిగా నిషేధం. కరోనా వల్ల బంతికి ఉమ్మి రాయడాన్ని గత రెండేళ్లుగా ఐసీసీ నిషేధించింది. ఇక దీనిని శాశ్వతంగా నిషేధించనున్నారు.

4. పెనాల్టీ.  బంతి వేసే ముందు ఫీల్డింగ్ చేస్తున్న జట్టులోని ప్లేయర్ కావాలని కదిలితే దానిని డెడ్ బాల్ గా పరిగణించేవాళ్లు. అయితే అక్టోబర్ 1 నుంచి అనైతింగా సరిగ్గా బంతి వేసేముందు ఫీల్డర్ కదిలితే బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు 5 పరుగులను జత చేస్తారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, ICC, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rohit sharma, Steve smith, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు