క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పొట్టి ప్రపంచ కప్ టోర్నమెంట్ తేదీలు, వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచులు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి.
అక్టోబర్ 22న తొలి మ్యాచ్‌లో గతేడాది టీ20 వరల్డ్‌కప్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇక గ్రూప్-2 సూపర్ 12 స్టేజ్‌లో భారత్ తలపడనుంది. అక్టోబర్ 23న తొలిపోరులో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. కాగా, గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి.
ఇక నవంబర్ 9న సిడ్నీ వేదికగా తొలి సెమీఫైనల్ ఉంటే.. నవంబర్ 10న అడిలైడ్ వేదికగా రెండో సెమీస్ ఉంటుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జరగనుంది. 2007 నుంచి ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ధోనీ సారథ్యంలోని భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ రెండుసార్లు, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా చెరోసారి విజేతలుగా నిలిచాయి. పూర్తి షెడ్యూల్ ఇదే
The fixtures for the ICC Men’s #T20WorldCup 2022 are here!
All the big time match-ups and how to register for tickets ?
— ICC (@ICC) January 20, 2022
గ్రూప్-2 సూపర్ 12 స్టేజ్‌లో భారత్ తలపడనుంది. అక్టోబర్ 23న జరిగే తొలి మ్యాచ్ లోనే ఇండియా.. పాకిస్తాన్ ను ఢీకొట్టనుంది. గత ప్రపంచ కప్ లో తొలిసారి భారత్ దాయాది చేతిలో పరాజయం చెందడం తెలిసిందే. దానికి ప్రతీకారం ఈ ఏడాది ఉండొచ్చనే అంచనాలున్నాయి. టీమిండియాకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Icc world cut