బీసీసీఐని చూసి నేర్చుకోండి.. ఐసీసీ తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం

ICC World Cup | ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వర్షం పడితే, గ్రౌండ్ మొత్తం పట్టాలతో కప్పేసింది బీసీసీఐ. కానీ, ఐసీసీ మాత్రం వరల్డ్ కప్ టోర్నీలో కూడా సరైన చర్యలు తీసుకోలేదు.

news18-telugu
Updated: June 13, 2019, 10:29 PM IST
బీసీసీఐని చూసి నేర్చుకోండి.. ఐసీసీ తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం
పై చిత్రం ఐపీఎల్, కింద చిత్రం వరల్డ్ కప్
  • Share this:
వరల్డ్ కప్‌లో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం పాడైపోయింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించింది ఐసీసీ. అయితే, అద్భుతమైన మ్యాచ్‌ను చూద్దామనుకున్న క్రికెట్ అభిమానులకు ఐసీసీ తీరు తీవ్ర నిరాశ కలిగించింది. ఐసీసీ తీరుమీద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ జరుగుతున్న సమయంలో వర్షం నుంచి గ్రౌండ్‌ను కాపాడడానికి ఐసీసీ సరైన చర్యలు చేపట్టలేకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూనే ఉంది. అయినా సరే గ్రౌండ్‌ను కాపాడడానికి ఐసీసీ గట్టి చర్యలు మాత్రం తీసుకోలేదు.

ఇలాంటి పరిస్థితే గతంలో బీసీసీఐ ఎదుర్కొంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో వర్షం పడింది. దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకున్న బీసీసీఐ.. గ్రౌండ్ మొత్తాన్ని పట్టాలతో కప్పి ఉంచింది. దీని వల్ల గ్రౌండ్‌కు నష్టం లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత యధావిధిగా మ్యాచ్ ఆడుకునే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకున్నటువంటి చర్యలను కూడా వరల్డ్ కప్ నిర్వహిస్తున్న ఐసీసీ తీసుకోకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆగ్రహానికి కారణం అవుతోంది. మరోవైపు ఈనెల 16న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఆ రోజు కూడా మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు ప్రముఖ వాతావరణ సంస్థ విండీ తెలిపింది.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు