Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC : బీసీసీఐ మాటకు తలొగ్గిన ఐసీసీ.. ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై తీసుకున్న నిర్ణయం ఇదే

ICC : బీసీసీఐ మాటకు తలొగ్గిన ఐసీసీ.. ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై తీసుకున్న నిర్ణయం ఇదే

పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యంలో నెలకొన్న సందిగ్దం మరో నాలుగు వారాల పాటు కొనసాగనున్నది. జూన్ 28 లోపు ఇండియాలో మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం అవుతుందో లేదో ఐసీసీకి బీసీసీఐ తెలియజేయాల్సి ఉన్నది.

  బీసీసీఐ (BCCI) అంటేనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. ఐసీసీ (ICC) వద్ద కూడా బీసీసీఐ మాటే చెల్లుబాటు అవుతుంది. బిగ్ త్రీ బోర్డుల్లో ఒకటైన బీసీసీఐ మరో సారి ఐసీసీ వద్ద తన పట్టును నిలుపుకున్నది. కరోనా కారణంగా సందిగ్దంలో పడిన పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021పై (T20 World Cup 2021) నిర్ణయం తీసుకునేందుకు గడువు కోరింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధి, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా టీ20 వరల్డ్ కప్‌ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకునేందుకు నెల రోజుల సమయం కావాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆతిథ్య హక్కులపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని.. కాబట్టి తనకు కొంత గడువు కావాలని కోరారు. బీసీసీఐ అభ్యర్థనను పరిశీలించిన ఎగ్జిక్యూటీవ్ కమిటీ నాలుగు వారాల గడువును ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 28లోపు టీ20 వరల్డ్ కప్‌పై ఒక నిర్ణయానికి రావాలని.. ఆ తర్వాత ఐసీసీ ప్లాన్ బిని అమలు చేస్తుందని చెప్పినట్లు సమాచారం. దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాజీవ్ శుక్లా నేరుగా హాజరుకాగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా వర్చువల్ పద్దతిలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.

  నాలుగు వారాల తర్వాత కూడా ఇండియా వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐ చేతులు ఎత్తేస్తే.. యూఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేస్తామని ఐసీసీ చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ అక్టోబర్ 10న ముగియనుండటంతో ఆ వెంటనే 18వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే ఆతిథ్య హక్కులు పూర్తిగా యూఏఈకే కేటాయిస్తారా? లేదా బీసీసీఐ-యూఏఈకి సంయుక్తంగా కేటాయిస్తారా అనే దానిపై నాలుగు వారాల తర్వాతే స్పష్టత రానున్నది. దీంతో ఇప్పుడు బీసీసీఐ ఆతిథ్య హక్కులు పోగొట్టుకోకుండా ఉండాలంటే నాలుగు వారాల్లో పరిస్థితులు చక్కబడాల్సి ఉన్నది.

  Susheel Kumar : గ్యాంగ్‌స్టర్‌నే మించి పోయిన సుశీల్ నేరాలు.. పోలీసుల కస్టడీలో పలు విషయాలు బహిర్గతం

  ఇండియాలో 9 వేదికలను టీ20 వరల్డ్ కప్ కోసం ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ 9 నగరాల్లో 16 జట్లకు బయోబబుల్ రక్షణలో వసతితో పాటు సాధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. అదే విధంగా పాకిస్తాన్‌కు సంబంధించి వీసా సంబంధిత సమస్యలతో పాటు వారి రక్షణకు కూడా బీసీసీఐ భరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా భారత ప్రభుత్వం నుంచి ఐసీసీ టోర్నీలకు సంబంధించిన పన్ను మినహాయింపు సమస్య ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్నది. దీనిని కూడా బీసీసీఐ సత్వరమే పరిష్కారించాలి. వీటన్నింటినీ నాలుగు వారాల్లో పూర్తి చేసి ఐసీసీ ముందుకు వెళ్తే కానీ.. టీ20 వరల్డ్ కప్ వేదికపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.

  First published:

  Tags: Bcci, ICC, Sourav Ganguly, T20 World Cup 2021

  ఉత్తమ కథలు