ఐపీఎల్ (IPL) సూపర్ సక్సెస్ తో మిగతా దేశాలు అన్నీ టీ20 లీగ్ (T20 Leagues)లను ప్రారంభించాయి. T20 క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, చాలా మంది క్రికెట్ లవర్స్ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ (Test Cricket)కు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూసేవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. అయితే, టెస్ట్ క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ (ICC). ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ మీద మోజు పెరుగుతున్నందున ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్ కు మరింత గడ్డుకాలం ఎదురుకానుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే (Greg Barclay) ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టుకు హాజరైన బార్క్లే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
' కొన్ని దేశాలు టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించడం లేదు. మరికొన్ని దేశాలేమో ఐసీసీ నిర్దేశించిన విధంగా టెస్టులు ఆడేందుకు సుముఖంగా లేవు. కానీ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం టెస్టు క్రికెట్ ఆడటంలో ఏ ఇబ్బందులూ ఎదుర్కోవడం లేదు..' అని వివరించారు. రానున్న రోజుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ దే భవిష్యత్ అని.. అభిమానులు, బోర్డులు కూడా అవే కోరుకుంటున్నాయని బార్క్లే తెలిపారు.
‘వివిధ దేశాలలో ఫ్రాంచైజీ క్రికెట్, స్థానికంగా డొమెస్టిక్ లీగ్స్ పెరుగుతుండటం టెస్టు క్రికెట్ కు పెను ప్రమాదంగా మారింది. ఈ లీగ్ క్రికెట్ వల్ల ద్వైపాక్షిక సిరీస్ లకు ఆటంకం ఏర్పడుతున్నది. టీ20 క్రికెట్ విస్తృతి పెరుగుతుండటం వల్ల రెండు దేశాల మధ్య టెస్టులను ఆడించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది..’ అని అన్నారు బార్క్లే.
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ఆర్థికంగా బలంగా ఉన్న బోర్డులు తప్ప మిగిలిన దేశాలు టెస్టులు ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని బార్క్లే తెలిపారు. న్యూజిలాండ్ వంటి దేశం కూడా టీ20 లకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నదని.. జీతాల చెల్లింపు, బోర్డుల నిర్వహణ కారణంగా ఆయా దేశాలు పొట్టి ఫార్మాట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని బార్క్లే చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : 'ఛీ .. నువ్వు అసలు అక్కావేనా.. హానీమూన్ గురించి తమ్ముడికి ఇలాంటి సలహానా '
మహిళల క్రికెట్‌కు సంబంధించి టెస్ట్ ఫార్మాట్ వేగంగా అభివృద్ధి చెందడం లేదని బార్క్లీ అన్నారు. టెస్టు క్రికెట్‌కు దేశవాళీలో సరైన ఏర్పాటు అవసరం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రస్తుతం అన్ని దేశాల్లో లేదు. భవిష్యత్తులో కూడా మహిళల టెస్టు క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకోను అని ఆయన తెలిపారు.
టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. టోర్నీ తొలి సీజన్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ పోటీల రెండో సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే.. ఆదాయం కోసం అన్ని దేశాలు టీ20 లీగులు ప్రారంభించాయ్. ఇదంతా టెస్టు క్రికెట్‌పై ప్రభావం చూపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, ICC, IPL, T20 World Cup 2022, Test Cricket