ICC Decisions on Umpire's Call : అంపైర్స్ కాల్‌పై ఐసీసీ కీలక నిర్ణయాలు.. కోహ్లీ అభ్యంతరాలు తిరస్కరణ

ప్రతీకాత్మక చిత్రం @ ICC Twitter

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) (ICC - International Cricket Council) క్రికెట్ (Cricket) బుక్‌లో ఉన్న రూల్స్‌పై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వాటిలో అంపైర్స్ కాల్ (Umpire's Call), డీఆర్ఎస్‌పై (DRS) ఇటీవల ముగిసిన ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ (India Vs England) సందర్భంగా కీలక చర్చ జరిగింది. ఫీల్డ్ అంపైర్లు (Umpires) తీసుకున్న పలు నిర్ణయాలు భారత జట్టుకు వ్యతిరేకంగా రావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక వన్డేలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ విషయంలో సాఫ్ట్ సిగ్నల్ కీలక పాత్ర పోషించింది. అలాగే టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఎల్బీడబ్ల్యూకి రివ్యూ కోరినప్పుడు అంపైర్స్ కాల్ పెద్ద అడ్డంకిగా మారింది. అంపైర్స్ కాల్ వల్ల ఫీల్డింగ్ జట్టుకు పెద్ద అవరోధంగా మారిందని.. ఐసీసీ దీనిపై వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ కోహ్లీ బహిరంగంగానే కోరాడు. ఇటీలవ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో అంపైర్స్ కాల్ సహా అనేక కీలక విషయాలపై నిర్ణయం తీసుకున్నారు.

    డెషిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)తో పాటు షార్ట్ రన్, క్యాచెస్ వంటి నిర్ణయాలతో పాటు మహిళల క్రికెట్‌కు సంబంధించిన పలు నిబంధనలు పునఃసమీక్షించారు. వీటన్నింటినీ ఐసీసీ ఆధ్వర్యంలోని క్రికెట్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆమోదించింది.

    ఇంగ్లాండ్‌తో సిరీస్ సమయంలో అంపైర్స్ కాల్, సాఫ్ట్ సిగ్నల్ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బీసీసీఐ కూడా సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేయాలని ఐసీసీకి లేఖ రాసింది. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

    ఇవే నిర్ణయాలు..

    ఐసీసీ క్రికెట్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకున్నది. వీటిలో ముఖ్యమైనవి ఇవే

    1. ఎల్బీడబ్ల్యూ నిర్ణయం డీఆర్ఎస్‌కు వెళ్లినప్పుడు అంపైర్స్ కాల్ గతంలో కేవలం వికెట్ల ఎత్తు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు బెయిల్స్ టాప్ వరకు దాన్ని పెంచారు. అంతే కాకుండా.. ఏదైనా వికెట్‌కు 50 శాతం వరకు బాల్ తగలాలి అనే నిబంధనను పక్కన పెట్టి.. బంతి వికెట్లకు తాకితే అవుట్‌గా నిర్ణయం తీసుకున్నారు.

    2. షార్ట్ రన్ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తుది నిర్ణయం కాబోదు. టీవీ అంపైర్ (థర్డ్ అంపైర్ )తీసుకునే నిర్ణయమే అంతిమం కానున్నది.

    3. పురుషుల వన్డే క్రికెట్‌లో మ్యాచ్ టై అయితే రిజల్ట్ టైగానే ఉంచుతున్నారు. అయితే మహిళల మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చనున్నారు.

    4. ఇకపై మహిళల వన్డే మ్యాచ్‌లలో బ్యాటింగ్ పవర్ ప్లే ఉండదు.

    Published by:John Naveen Kora
    First published: