INDvsSA: నాపేరు ఖూనీ చేయకండి.. ఇలా పలకండంటున్న సౌతాఫ్రికా ప్లేయర్

దక్షిణాఫ్రికా జట్టులో Andile Phehlukwayo అనే ఆటగాడు ఉన్నాడు. ఆ ప్లేయర్ పేరును ఎలా పలకాలా అని చాలా మందికి సందేహం వచ్చింది.

news18-telugu
Updated: June 5, 2019, 5:44 PM IST
INDvsSA: నాపేరు ఖూనీ చేయకండి.. ఇలా పలకండంటున్న సౌతాఫ్రికా ప్లేయర్
పేషుక్వాయో (Image:Twitter)
  • Share this:
పేరులో ఏముంది అనుకోవద్దు. పేరులో చాలా ఉంది. చాలా మందికి పేర్లు చదవడం, రాయడం రాకపోతే.. ఆ పేరుగల వాళ్లు ఎంత ఫీల్ అవుతారో తెలీదు. చాలా హర్ట్ అవుతారు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించి పేర్ల విషయంలో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ల పేర్లు స్థానికంగా ఎలా పలుకుతారో తెలియక చాలా మంది తికమకపడతారు. అయితే, ‘నా పేరు తెలియకపోతే నన్ను అడగండి. అంతే కానీ పేరును ఖూనీ చేయకండి’ అంటున్నాడో సౌతాఫ్రికా ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టులో Andile Phehlukwayo అనే ఆటగాడు ఉన్నాడు. ఆ ప్లేయర్ పేరును ఎలా పలకాలా అని చాలా మందికి సందేహం వచ్చింది. దీంతో అతడే ముందుకొచ్చాడు. తన పేరును ఇలా పలకాలని సూచించాడు. ‘పేషుక్వాయో’ అని పలుకుతారట.

First published: June 5, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading