ఆసీస్‌కు వరల్డ్‌కప్ అంటే మోజు... వన్డేల్లో 500 స్కోరు దాటే మొదటి జట్టు అదే... - విరాట్ కోహ్లీ

ఇంగ్లండ్ ప్లేయర్లు తలుచుకుంటే 500 స్కోరు కచ్ఛితంగా సాధ్యమే. అందరి కంటే ముందు వారి ఆ స్కోరు కొట్టాలని చూస్తున్నారు... ఆసీస్ నుంచి ఎంతో నేర్చుకున్నాం... - వరల్డ్ కప్ ప్రారంభానికి కెప్టెన్ల సమావేశంలో విరాట్ కోహ్లీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 25, 2019, 11:51 AM IST
ఆసీస్‌కు వరల్డ్‌కప్ అంటే మోజు... వన్డేల్లో 500 స్కోరు దాటే మొదటి జట్టు అదే...  - విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)
  • Share this:
300... వన్డేల్లో ఓ జట్టు 300 స్కోరు దాటిందంటే అది భారీ స్కోరు కిందే లెక్క. అయితే ఇప్పుడు ఆ మార్కు చాలా చిన్నదైపోయింది. పాకిస్థాన్‌‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ వరుసగా నాలుగు మ్యాచుల్లో 340+ స్కోరు నమోదుచేసి రికార్డు క్రియేట్ చేసింది. మూడో వన్డే పాక్ 358 పరుగుల భారీ స్కోరు చేసినా... ఇంగ్లండ్ దాన్ని 44.5 ఓవర్లలోనే ఊది పాడేసింది. వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్... ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ పట్టేయాలనే కసితో కనిపిస్తోంది. చాలామంది మాజీ క్రికెటర్లు కూడా ఈసారి కప్ కొట్టేది ఇంగ్లండే అని అంచనా వేస్తున్నారు. తాజాగా భారత సారథి విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లండ్ టీమ్ గురించి మాట్లాడాడు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు 10 జట్ల కెప్టెన్లతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది ఐసీసీ. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.... ఈ సారి వరల్డ్ కప్‌లో రికార్డు స్కోర్లు నమోదు కావచ్చని అంచనా వేశాడు. మీడియా నుంచి ప్రపంచకప్ 2019లో 500 మార్క్ దాటడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న ఎదురైంది విరాట్ కోహ్లీ. ‘ఇంగ్లండ్ ప్లేయర్లు తలుచుకుంటే 500 స్కోరు కచ్ఛితంగా సాధ్యమే. అందరి కంటే ముందు 500 కొట్టాలనే తపన, తాపత్రయం వారిలో కనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. బ్యాట్స్‌మెన్ రాజ్యమేలుతున్న తరుణంలో బౌలర్లపై జాలి, దయ దరిచేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని తెలిపాడు విరాట్.


ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపిన భారత సారథి విరాట్ కోహ్లీ... ఆధిక్యం కోల్పోయినా, సిరీస్‌ను ఎలా చేజిక్కించుకోవాలో ఆసీస్ నేర్పిందని అన్నారు. ‘ఆసీస్ సిరీస్ నుంచి మేం చాలా నేర్చుకున్నాం. తొలి రెండు వన్డేలు గెలిచి లీడ్ సాధించిన తర్వాత ఇంకోటి గెలిస్తే సిరీస్ వచ్చేస్తుందని భావించాం. కానీ ఆసీస్ అద్భుతంగా ఆడింది. భారత జట్టు కంటే దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఆడి సిరీస్ సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఏ టీమ్‌తో ఆడినా... ఆసీస్‌లా ఆడాలి. వారిలా ఆట పట్ల మోజుతో, అంకితభావంతో ఆడాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. పాక్‌తో మ్యాచ్ అన్ని మ్యాచుల్లాగే ఓ రెగ్యూలర్ మ్యాచ్ అంటూ దాయాదిపై పోరులో ప్రత్యేకత లేదని కొట్టిపారేశాడు కింగ్ కోహ్లీ.

First published: May 25, 2019, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading