ICC Cricket World Cup 2019 | టీమిండియాకు దక్కిన ప్రైజ్ ఎంతో తెలుసా?

Team India Prize money | సెమీఫైనల్లో వెనుదిరిగిన భారత జట్టుకు సుమారు రూ.5.47 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.

news18-telugu
Updated: July 12, 2019, 4:59 PM IST
ICC Cricket World Cup 2019 | టీమిండియాకు దక్కిన ప్రైజ్ ఎంతో తెలుసా?
ఇండియన్ క్రికెట్ టీం(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 12, 2019, 4:59 PM IST
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో సెమీ పైనల్లోనే భారత్ వెనుదిరిగింది. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ ప్రపంచ క్రికెట్ సంగ్రామంలో పాల్గొన్నందుకు విరాట్ సేనకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా. అక్షరాలా రూ.5.47 కోట్లు. సెమీస్‌లో ఇంగ్లండ్‌ మీద ఓడిన ఆస్ట్రేలియాకు కూడా ఇంతే ప్రైజ్ మనీ దక్కనుంది. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ.27.4లక్షలు ఐసీసీ చెల్లిస్తుంది. ఇక ఫైనల్లో గెలిచిన విజేతకు సుమారు రూ.27.38 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు సుమారు రూ.13.7 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. విన్నర్‌కు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేస్తారు. జూలై 14న ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్‌ను ముద్దాడ లేకపోయాయి. కాబట్టి, ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయం.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...