మంజ్రేకర్‌పై జడేజా కౌంటర్.. అభినందిస్తున్న నెటిజన్లు

Ravindra Jadeja | మంజ్రేకర్ వ్యాఖ్యలకు జడేజాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ట్విట్టర్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చాడు.

news18-telugu
Updated: July 3, 2019, 8:25 PM IST
మంజ్రేకర్‌పై జడేజా కౌంటర్.. అభినందిస్తున్న నెటిజన్లు
రవీంద్ర జడేజా (File)
  • Share this:
టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత కామెంటేటర్ అయిన సంజయ్ మంజ్రేకర్‌కు రవీంద్ర జడేజా కౌంటర్ ఇచ్చాడు. తన మీద సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇంగ్లండ్ - భారత్ మ్యాచ్ మధ్య మ్యాచ్‌లో జడేజా ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. క్రికెట్ లవర్స్ అందరూ దాన్ని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. అయితే, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం దాన్ని తీసిపారేసినట్టుగా మాట్లాడాడు.

మంజ్రేకర్ వ్యాఖ్యలకు జడేజాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ట్విట్టర్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చాడు. ‘నీ కంటే రెండింతల ఎక్కువ మ్యాచ్‌లు ఆడా. ఇంకా ఆడుతున్నా. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో.’ అంటూ మరికొంచెం ఘాటుగా స్పందించాడు.


సంజయ్ మీద జడేజా ట్వీట్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>