PAK vs BAN: బంగ్లాదేశ్‌పై 500 పరుగులు కొట్టేస్తాం.. సర్ఫరాజ్ అహ్మద్

ICC Cricket World Cup 2019 : పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఆ జట్టు అత్యధిక రన్స్ 399. జింబాబ్వే మీద చేసింది.

news18-telugu
Updated: July 5, 2019, 10:24 AM IST
PAK vs BAN: బంగ్లాదేశ్‌పై 500 పరుగులు కొట్టేస్తాం.. సర్ఫరాజ్ అహ్మద్
సర్ఫరాజ్ అహ్మద్ (FIle)
  • Share this:
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీస్‌కు చేరే అవకాశం లేదు. నెట్ రన్ రేట్ బీభత్సంగా ఉంటే తప్ప.. న్యూజిలాండ్‌ను దాటుకుని పాకిస్తాన్ సెమీస్‌కు చేరే చాన్స్ లేదు. అలా జరగాలంటే, పాకిస్తాన్ మొదట టాస్ గెలవాలి. కనీసం 450 రన్స్ కొట్టాలి. బంగ్లాదేశ్‌ మీద 316 పరుగుల తేడాతో విజయం సాధించాలి. పాకిస్తాన్ 316 పరుగులు చేస్తే... బంగ్లాదేశ్‌ను 0 పరుగులకే ఆలౌట్ చేయాలి. పెద్ద పెద్ద టీమ్‌లకే చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ జట్టును సున్నా పరుగులకే ఆలౌట్ చేయడం అంటే పాకిస్తాన్‌కు అసాధ్యమైన విషయం. అయితే, పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం ఈ మ్యాచ్‌లో ఏమైనా జరగొచ్చని అన్నాడు. బంగ్లాదేశ్ మీద 500 పరుగులు చేస్తామని ధీమాగా చెప్పాడు.

‘మనం కొంత రియలిస్టిక్‌గా ఉండాలి. అయితే, బంగ్లాదేశ్ మీద 500 రన్స్ చేసేందుకు మేం ప్రయత్నిస్తాం. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను 50 పరుగులకే ఆలౌట్ చేయడానికి ట్రై చేస్తాం. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే మేం 316 పరుగుల తేడాతో గెలవాలి. అందుకు తగ్గట్టు మేం గెలవడానికి ప్రయత్నిస్తాం.’ అని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. ఇప్పటి వరకు వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ 481. ఆస్ట్రేలియా మీద ఇంగ్లండ్ చేసింది. అంతకు మించిన స్కోర్ ఏ టీమ్ కూడా సాధించలేదు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఆ జట్టు అత్యధిక రన్స్ 399. జింబాబ్వే మీద చేసింది. ఒకవేళ పాకిస్తాన్ 500 పరుగులు చేస్తే.. కొత్త చరిత్ర సృష్టించినట్టే.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading