ICC Cricket World Cup 2019 : ప్రపంచ కప్ ముంగిట పాక్ టీమ్ లో విషాదం...క్రికెటర్ ఆసిఫ్ రెండేళ్ల కుమార్తె మృతి...

ICC Cricket World Cup 2019 : పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ కుమార్తె క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో సర్వత్రా విషాదం అలుముకుంది. వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న పాక్ జట్టులో ఈ వార్తతో విషాద ఛాయలు నిండాయి.

news18-telugu
Updated: May 20, 2019, 8:09 PM IST
ICC Cricket World Cup 2019 : ప్రపంచ కప్ ముంగిట పాక్ టీమ్ లో విషాదం...క్రికెటర్ ఆసిఫ్ రెండేళ్ల కుమార్తె మృతి...
ఆసిఫ్ అలీ (Image : twitter)
  • Share this:
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లో విషాదం చోటు చేసుకుంది. పాక్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ కుమార్తె క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో జట్టు సభ్యుల్లో విషాదఛాయలు కనిపిస్తున్నాయి. ప్రపంచ కప్ టోర్నీకి ముందుగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాక్ జట్టు వన్డే సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే పాక్ జట్టు సిరీస్ ను 4-0 తేడాతో కోల్పోయింది. ఇదిలా ఉంటే ఆసిఫ్ అలీ కుమార్తె రెండేళ్ల చిన్నారి నూర్ ఫాతీమా గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. గత ఏప్రిల్ నెలలో స్టేజ్ 4 క్యాన్సర్ చిన్నారికి సోకగా, వైద్యం అందిస్తున్నారు. అయితే కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పటికీ, బాధను దిగమింగుకొని ప్రపంచ కప్ సన్నాహాల్లో ఆసిఫ్ అలీ చురుగ్గా ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తన కుమార్తె మృతిపై ఆసిఫ్ స్వయంగా ట్వీట్ చేయడంతో తోటి క్రీడాకారులతో పాటు, నెటిజన్లంతా ఆసిఫ్‌కు జరిగిన విషాదం పట్ల దు:ఖం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర బాధలోనూ జట్టుతో కలిసి వెళ్లిన తీరు అంతా గుర్తుచేసుకుంటున్నారు.

 

First published: May 20, 2019, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading