news18-telugu
Updated: June 29, 2019, 5:55 PM IST
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా అభిమానుల కొట్లాట
క్రికెట్ ప్రపంచకప్లో పాకిస్తాన్ - అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. హెడింగ్లేలో మ్యాచ్ జరుగుతుండగా, స్టేడియం బయట అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఓ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ మీద అఫ్ఘనిస్తాన్ అభిమానులు దాడి చేసినట్టు ఓ ట్విట్టర్ యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మీద కొందరు యువకులు దాడి చేస్తున్నారు. బీభత్సంగా కొడుతున్నారు. వారి చేతిలో కొన్ని జెండాలు కూడా ఉన్నాయి. జెండాలు, కర్రలు, వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 29, 2019, 5:55 PM IST