హమ్మయ్య! భారత్ ఓడింది.. ఫైనల్‌కు వెళ్లేది మనమే..

ICC Cricket World Cup 2019 | IND vs ENG | 2015లో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ జారిపడిందని, ఇప్పుడు ఓడిపోవడం ఒకింత మంచికేనని అభిప్రాయపడుతున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 1:59 PM IST
హమ్మయ్య! భారత్ ఓడింది.. ఫైనల్‌కు వెళ్లేది మనమే..
(Image : Twitter)
  • Share this:
అది 2015 వరల్డ్ కప్.. బలమైన జట్టుతో టీమిండియా బరిలోకి దిగింది.. లీగ్ దశలో ఒక్కో జట్టును మట్టి కరిపిస్తూ దూసుకెళ్లింది. లీగ్‌లో మొత్తం ఆరు మ్యాచులకు గానూ ఆరు మ్యాచులను గెలిచి పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కూడా బంగ్లాదేశ్‌ వెన్ను విరిచి సగర్వంగా సెమీ ఫైనల్‌కు వెళ్లింది. అప్పుడున్న ఫామ్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం ఖాయం అనుకున్నారు భారత క్రికెట్ అభిమానులు. కానీ, 95 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో స్టీవ్స్ స్మిత్ సెంచరీతో కదం తొక్కాడు. 233 పరుగులకే టీమిండియా చాప చుట్టేసింది. లీగ్ దశలో ఒక్క ఓటమి లేకుండా సెమీస్ వరకు వెళ్లి ఒక్కసారిగా జారిపడిందని అభిమానులు తీవ్ర నిరాశలో కుంగిపోయారు.

అయితే, 2019 వరల్డ్ కప్ వచ్చేసరికి కూడా భారత్ బలమైన జట్టే. ఆల్ రౌండర్లు, అనుభవం, దూకుడు, దుర్భేద్యమైన బ్యాటింగ్, పేస్ బలంతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్‌ మ్యాచ్ వరకు భారత్ దూకుడుకు తిరుగే లేదు. ఆప్ఘనిస్తాన్ ‌మ్యాచ్‌లో టెన్షన్ పుట్టించినా.. వెస్టిండీస్ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. ఇంగ్లండ్ మ్యాచ్‌లోనూ పోరాడిన టీమిండియా విజయ తీరాలకు చేరలేకపోయింది. అయితే, ఈ మ్యాచ్ ఓడినందుకు కొందరు అభిమానులు సంతోషంగానే ఉన్నారు. 2015లో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ జారిపడిందని, ఇప్పుడు ఓడిపోవడం ఒకింత మంచికేనని అభిప్రాయపడుతున్నారు.

అన్ని మ్యాచ్‌లు గెలుస్తూ పోయి, చివరికి డీలా పడేదని, ఇప్పుడు క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడతారని, ఫైనల్‌‌కు వెళ్లేది టీమిండియానేనని జోస్యం చెబుతున్నారు. మరోవైపు, ఈ ఓటమి ద్వారా పాక్‌ను ఇంటి బాట పట్టించినందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సెమీస్ చేరాలంటే భారత్ ఇంకో మ్యాచ్‌లో గెలవాలి. రేపు బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 1, 2019, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading