భారత క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. ఇప్పటికే అన్ని మ్యాచ్‌లలో గెలిచి దూసుకుపోతున్న టీమిండియా ఈ రోజు వెస్టిండీస్‌తో తలపడబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వేదికగా నిలుస్తోంది. సెమిస్ బెర్తు ఖాయం చేసుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగుతుండగా, సెమిస్ బరిలో నిలిచేందుకు విండీస్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. కాగా, వరల్డ్ కప్‌లో భాగంగా రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. భారత జట్టు ఐదు సార్లు విజయం సాధించింది. అందులో 1983 వరల్డ్ కప్ ఫైనల్ ఒకటి. మొత్తంగా చూసుకుంటే రెండు దేశాల టీంలు 126 మ్యాచ్‌లు ఆడగా వెస్టిండీస్ 62 సార్లు జయ కేతనం ఎగురవేసింది. 59 మ్యాచ్‌లలో భారత్ గెలవగా, రెండు టై అయ్యాయి. 3 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
తుది జట్టు అంచనా:
ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్/విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్/షమీ, బుమ్రా
వెస్టిండీస్: క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రావో, షిమ్రన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రస్సెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్‌వైట్, ఆష్లే నర్స్, షెల్డన్ కోట్రల్, ఒషానే థామస్