Virat Kohli | కోహ్లీ... కోపం తగ్గించుకో.. లేకపోతే వరల్డ్ కప్ నుంచి ఔట్..

Virat Kohli | అఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ మీదకు దూసుకెళ్లాడు. ఐసీసీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.

news18-telugu
Updated: July 4, 2019, 3:54 PM IST
Virat Kohli | కోహ్లీ... కోపం తగ్గించుకో.. లేకపోతే వరల్డ్ కప్ నుంచి ఔట్..
అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న కోహ్లీ (File)
news18-telugu
Updated: July 4, 2019, 3:54 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అంపైర్లతో గొడవ పడడం మానుకోవాలి. ‘కాదు.. కూడదు.. నేను ఇలాగే ఉంటా అంటే.. వరల్డ్ కప్‌ నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది.’ క్రికెట్ గ్రౌండ్‌లో దూకుడుగా ఉండడం విరాట్ కోహ్లీకి అలవాటే. అయితే, అదే అతడి కొంప ముంచుతోంది. ఇటీవల వరల్డ్ కప్‌లో అఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ మీదకు దూసుకెళ్లాడు. ఐసీసీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. దీంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా జోడించారు. గతంలో కూడా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా కోహ్లీ ఇలాగే చేశాడు. అప్పుడు కూడా ఓ డీమెరిట్ పాయింట్ పడింది. దీంతో ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ రెండేళ్ల కాలంలో నాలుగుసార్లు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే అతడిపై చర్యలు తీసుకుంటారు. రెండు డీ మెరిట్ పాయింట్లు అంటే.. ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు సమానం. ఈనెల 6న శ్రీలంకతో ఇండియా మ్యాచ్ సందర్భంగా కోహ్లీ క్రమశిక్షణ తప్పితే.. అతడి ఖాతాలో మరోసారి డీమెరిట్ పాయింట్లు పడే చాన్స్ ఉంది. ఒకవేళ కోహ్లీ అకౌంట్‌లో మరో రెండు డీమెరిట్ పాయింట్లు పడితే.. విరాట్ మీద రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. ఒకవేళ అదే జరిగితే, కోహ్లీ వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ (ఒకవేళ వస్తే) మ్యాచ్‌లకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.

First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...