ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని లంక కెప్టెన్ కరుణ రత్నే బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. ఇంగ్లండ్ జట్టు ఏ మార్పూ లేకుండా బరిలోకి దిగగా, లంక రెండు మార్పులు చేసింది. జీవన్ మెండిస్, ఫెర్నాండోను తుది జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌లాడిన లంక ఒకదాంట్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కాగా, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ కరుణరత్నే(1), వికెట్ కీపర్ కుశాల్ పెరీరా(2) వెంటవెంటనే అవుట్ అయ్యారు. క్రిస్ వోక్స్, ఆర్చర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 9 ఓవర్లకు 37/2 గా ఉంది. క్రీజులో ఫెర్నాండో(31), కుశాల్ మెండిస్(3) ఉన్నారు.
Jofra Archer struck in his first over to dismiss #DimuthKarunaratne with a beauty, going across the left-hander 👌
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
Watch the dismissal on the dedicated #CWC19 app.
DOWNLOAD ⬇️
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/R64L3sB7a1
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Cricket World Cup 2019, England, ICC, ICC Cricket World Cup 2019, Sri Lanka