ENG vs AUS: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్-పాక్ మ్యాచ్ కన్నా..

ICC World Cup 2019: శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 25, 2019, 2:50 PM IST
ENG vs AUS: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్-పాక్ మ్యాచ్ కన్నా..
క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ ఫోటో
  • Share this:
వరల్డ్ కప్ 2019లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆతిథ్య దేశం టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు లార్డ్స్ వేదికగా నిలుస్తోంది. శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. గత టీంతోనే బరిలోకి దిగుతోంది. కాగా, ఆస్ట్రేలియా జట్టులో ఆడమ్ జంపా, కౌల్టర్ నైల్ స్థానంలో నాథన్ లియాన్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్ ఆడుతున్నారు. కాగా, ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులు పూనకం వచ్చినట్లు మారిపోతారు. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి టీవీల ముందు అతుక్కుపోతారు. కానీ, భారత్ పాక్ మ్యాచ్ లాగే మరో రెండు దేశాలు పోటీ పడితే అభిమానులు కళ్లప్పగించి చూస్తారు. ఆ దేశాలే.. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా. ఈ రెండు దేశాలు ఎప్పుడు పోటీ పడ్డా.. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒక విధమైన భావోద్వేగాలు, ఉత్సాహం ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు అంత ఆదరణ. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రెండు దేశాలు ఈ రోజు తలపడనుండగా ఫలితంపై క్రికెట్ ప్రపంచం ఆస్తకితో ఎదురు చూస్తోంది.


Published by: Shravan Kumar Bommakanti
First published: June 25, 2019, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading