‘డేవిడ్ వార్నర్ ఛీటర్’... వన్డే వరల్డ్‌కప్ ముందు చిచ్చురేపుతున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్...

బాల్ టాంపరింగ్ వివాదాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్... ఇలాంటి వాటికి భయపడబోమని స్పష్టం చేసిన ఆసీస్ కోచ్... సోషల్ మీడియాలో ఇంగ్లండ్, ఆసీస్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 14, 2019, 3:53 PM IST
‘డేవిడ్ వార్నర్ ఛీటర్’... వన్డే వరల్డ్‌కప్ ముందు చిచ్చురేపుతున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్...
డేవిడ్ వార్నర్(File)
  • Share this:
ఐపీఎల్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం వన్డే వరల్డ్‌కప్‌పైనే ఉంది. మే 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ సారి ప్రతీజట్టు మెరుగ్గా రాణిస్తుండడం, ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్...ఇలా హాట్ ఫెవరెట్స్‌గా భావిస్తున్న జట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం ప్రపంచకప్‌పై క్రేజ్ పెంచేస్తోంది. వీటిల్లో స్వదేశంలో టోర్నీ జరుగుతుండడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. దీంతో ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో వన్డే వరల్డ్‌కప్ గురించి పోస్టులు, కామెంట్లు పెడుతూ జోరు పెంచుతున్నాయి. తమ జట్టు గెలుస్తుందని చెబితే ఓకే గానీ ప్రత్యర్థి జట్టుపై కామెంట్స్ చేస్తూ, వివాదాలు రేపుతున్నారు కొందరు ఫ్యాన్స్. టోర్నీ ఆరంభానికి ముందే ఆసీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ... సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. గత ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్, క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసిన ‘బాల్ టాంపరింగ్’ వివాదాన్ని ఉద్దేశిస్తూ బార్మ ఆర్మీ పేరుతో ఓ ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చేతుల్లో సాండ్ పేపర్ పట్టుకున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసిన సదరు ట్విట్టర్ పేజ్... డేవిడ్ వార్నర్ షర్టు మీద ‘ఆస్ట్రేలియా’ అని ఉండే అక్షరాలకు బదులుగా ‘ఛీట్స్’ అనే పదం పెట్టింది. లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్న సదరు బార్మీ ఆర్మీ అధికారిక ఖాతాలో ఈ ఫోటో పోస్ట్ కావడంతో ట్విట్టర్‌లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదాన్ని గుర్తుకు చేసుకుంటూ, వారి క్రీడాస్ఫూర్తిని కించపరుస్తుంటే... మరికొందరు మాత్రం ఇంగ్లండ్ టీమ్ చేసిన ఛీటింగ్స్‌ను గుర్తుకు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ కావడంతో ఆస్ట్రేలియా కోచ్ జసిన్ లాంగర్ కూడా స్పందించాడు.

ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా ఆస్ట్రేలియా టీమ్ భయపడదు. వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం...
ఆసీస్ కోచ్ జసిన్ లాంగర్


గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బాల్ టాంపరింగ్ చేసిన కారణంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బాంక్రాఫ్ట్‌లను క్రికెట్ నుంచి ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధం ముగిసిన తర్వాత ఐపీఎల్‌లో మెరిసిన ఈ స్టార్స్.. వన్డే వరల్డ్‌కప్ కోసం ముందుగానే స్వదేశం చేరారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగిన డేవిడ్ వార్నర్...12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
First published: May 10, 2019, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading