T20 World Cup : పురుషుల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. ఆతిథ్యం ఇచ్చేది బీసీసీఐ

అక్టోబర్ 17క నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్.. వెల్లడించిన ఐసీసీ

యూఏఈ, ఒమన్ వేదికల్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నటు ఐసీసీ ప్రకటించింది. కాగా, బీసీసీఐ వద్దనే ఈ మెగా ఈవెంట్ హక్కులు ఉండబోతున్నాయి.

 • Share this:
  పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup) నిర్వహణపై సందిగ్దం వీడింది. యూఏఈ, ఒమన్ వేదికల్లో అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నట్లు ఐసీసీ (ICC) తెలిసింది. ఇండియాలో జరగాల్సిన మెగా ఈవెంట్‌కు కరోనా కారణంగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని భావించి.. యూఏఈ, ఒమన్‌కు తరలించడానికి బీసీసీఐ నిర్ణయించింది. మేరకు జూన్ 28న ఐసీసీకి కూడా సమాచారం అందించింది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ), ఒమన్ క్రికెట్ అసోసియేషన్లలో బీసీసీఐ చర్చలు ఫలవంతం అయ్యాయి. అక్టోబర్ 17 నుంచి ప్రిలిమినరీ మ్యాచ్‌లు ప్రారంభించి నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ ప్రకటించారు. 'టీ20 వరల్డ్ కప్ 2021ని సూర్తి సురక్షితంగా ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నాము. అయితే ఇండియాలో కాకుండా యూఏఈ, ఒమన్ స్టేడియంలలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయ. పూర్తిగా బయోబబుల్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తాము.' అని జెఫ్ అలార్డైస్ అన్నారు. ఇప్పటికే బీసీసీఐ, ఈసీబీ, ఒమన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిమామని ఆయన అన్నారు.

  కాగా ఈ మెగా ఈవెంట్ ఇండియా వెలుపల నిర్వహిస్తున్నా సరే ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ వద్దనే ఉంటాయి. ఐపీఎల్ ఎలాగైతే యూఏఈలో నిర్వహిస్తున్నారో.. అదే పద్దతిలో బీసీసీఐ వరల్డ్ కప్ నిర్వహించనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.  ఐపీఎల్ 2021 తుది దశ సెప్టెంబర్ 17న ప్రారంభించి అక్టోబర్ 10న ఫైనల్ నిర్వహించనున్నారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్న ఎనిమిది జట్ల నుంచి నాలుగు మెయిన్ డ్రా మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. అనంతరం ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఇప్పటికే అర్హత సాధించిన 8 జట్లకు ఈ నాలుగు జట్లు జత కలుస్తాయి. అనంతరం సూపర్ 12 మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో నిర్వహించునున్నట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు పూర్తి ఆతిథ్య హక్కులు బీసీసీఐ దగ్గరే ఉండటంతో ఈసీబీ, ఒమన్ క్రికెట్‌కు స్టేడియం అద్దెలు ఇతర ఖర్చులు మాత్రమే చెల్లించున్నది. ఆదాయం పూర్తిగా ఐసీసీ, బీసీసీఐ షేర్ చేసుకుంటాయి.
  Published by:John Naveen Kora
  First published: