ICC Awards: విరాట్ కోహ్లీకి మూడు కీలక అవార్డులు

ICC Awards | ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టుతో పాటు పాటు టెస్ట్ జట్టుకు కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా నిలిచారు. అలాగే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును సాధించాడు కోహ్లీ.

news18-telugu
Updated: January 15, 2020, 1:41 PM IST
ICC Awards: విరాట్ కోహ్లీకి మూడు కీలక అవార్డులు
విరాట్ కోహ్లీ
  • Share this:
క్రికెట్ చరిత్రలో రికార్డులను తిరగరాస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలకమైన మూడు ఐసీసీ అవార్డులను గెలుచుకున్నాడు. 2019 సంవత్సరానికిగాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితాలో టెస్ట్, వన్డే కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కోహ్లీ దక్కించుకున్నాడు. 2017 నుంచి ప్రతి సంవత్సరం కోహ్లీ ఈ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఐసీసీ ప్రకటించిన 11 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా...భారత్ నుంచి ఓపనర్ రోహిత్ శర్మ, మొహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే టెస్ట్ జట్టుకు సైతం కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా...మయాంక్ అగర్వాల్ మాత్రమే ఇందులో చోటు దక్కించుకున్నాడు. వన్డే, టెస్ట్ జట్టు రెండింటిలోనూ కోహ్లీతో పాటు స్టోక్స్, స్టార్క్ మాత్రమే చోటు దక్కించుకున్నారు.



దీంతో పాటు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డును కూడా విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ఒవల్ మైదానంలో క్రీజు దగ్గర స్టీవ్ స్మిత్‌కు ఇబ్బంది కలిగిస్తున్న భారత అభిమానులను అడ్డుకుని..క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు కోహ్లీ ఈ అవార్డు సాధించాడు.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు