Home /News /sports /

ICC ASKED TO SEND CRICKET BOARDS 15 PLAYER AND 8 OFFICIALS NAMES FOR T20 WORLD CUP BEFORE SEPTEMBER 20 JNK

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌ ఆడబోయే ఆటగాళ్లు వివరాలు వెంటనే పంపండి.. అన్ని బోర్డులకు ఐసీసీ అల్టిమేటం

ఆటగాళ్ల వివరాలు సెప్టెంబర్ 10లోగా పంపండి.. ఐసీసీ ఆదేశాలు (PC: ICC)

ఆటగాళ్ల వివరాలు సెప్టెంబర్ 10లోగా పంపండి.. ఐసీసీ ఆదేశాలు (PC: ICC)

ప్రతీ దేశానికి చెందిన క్రికెట్ బోర్డులు15 మంది ఆటగాళ్లు, 8 మంది టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుల పేర్లను వెంటనే తమకు పంపాలని ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎక్స్‌ట్రా ప్లేయర్ల విషయంలో మాత్రం ట్విస్ట్ ఇచ్చింది.

    యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను సెప్టెంబర్ 10లోగా పంపాలని ఐసీసీ (ICC) అల్టిమేటం జారీ చేసింది. ప్రతీ క్రికెట్ బోర్డు 15 మంది క్రికెటర్లు, 8 మంది టీమ్ మేనేజ్‌మెంట్ (కోచ్, సహాయక సిబ్బంది) పేర్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు తమకు ఐసీసీ నుంచి లేఖ అందినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారి ఒకరు శుక్రవారం ధృవీకరించారు. కాగా, టీ20 వరల్డ్ కప్ కోసం అదనపు ఆటగాళ్లను తీసుకొని రావడానికి ఐసీసీ అంగీకరించింది. కోవిడ్ 19తో పాటు బయోబబల్ నిబంధనల కారణంగా అదనపు ఆటగాళ్లను తెచ్చుకోవడానికి అనుమతించింది. కానీ ఐసీసీ మాత్రం 15 మంది ఆటగాళ్లు, 8 మంది టీమ్ మేనేజ్‌మెంట్ ఖర్చులను మాత్రమే ఐసీసీ భరించనున్నది. అదనంగా తీసుకొని వచ్చే వాళ్ల ఖర్చులను పూర్తిగా ఆయా క్రికెట్ బోర్డులే చూసుకోవాలని ఆ లేఖలో ఐసీసీ తేల్చి చెప్పింది. పురుషుల టీ20 వరల్డ్ కప్ చివరి సారిగా 2016లో ఇండియాలో నిర్వహించారు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కరోనా కారణంగా 2022కు వాయిదా వేశారు. ఇక ఈ ఏడాది ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్‌ను కరోనా కారణంగా యూఏఈకి తరలించారు.

    ఒమన్, యూఏఈ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నా.. ఆతిథ్యపు హక్కులు మాత్రం బీసీసీఐ దగ్గరే ఉన్నాయి. ఒమన్ వేదికగా ముందుగా ఎనిమిది దేశాలు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్ వంటి టెస్టు దేశాలు కూడా టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 23 వరకు ఒమన్, యూఏఈ వేదికగా ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ప్రధాన టోర్నీ నిర్వహించనున్నారు. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

    సెప్టెంబర్ 24 నుంచి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడే జట్లన్నీ సెప్టెంబర్ 10 లోగా యూఏఈ చేరుకోవాలని ఐసీసీ అదేశించింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, ICC, T20 World Cup 2021

    తదుపరి వార్తలు