రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్ (IPL 2022) లో తుస్సుమనిపించిన సంగతి తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక, రోహిత్ శర్మ అటు కెప్టెన్ గా.. ఇటు బ్యాటర్ గా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. లేటెస్ట్ గా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC).. తాజాగా వార్షిక ర్యాంకులను ప్రకటించింది. ఏ ఫార్మట్‌లో.. ఏ జట్టు.. ఏ ర్యాంక్‌లో ఉందో స్పష్టం చేసింది. ప్రత్యేకించి- టెస్ట్ క్రికెట్‌ను ఏలుతున్నదెవరో తేలిపోయింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అగ్రస్థానం ఏ దేశానికి దక్కిందో ఈ ప్రకటనతో వెల్లడైంది. ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్ టీ20 కేటగిరీలో ఏ దేశం ఏ పొజీషన్లో ఉందో వివరించింది ఐసీసీ..పాయింట్లతో సహా. ఈ మూడు ఫార్మట్లలోనూ భారత్ తొలి అయిదు స్థానాల్లోనే నిలవడం విశేషం.
ఈ ఏడాదికి (2021-22) చివరిసారిగా ప్రకటించే అంతర్జాతీయ ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్ లో.. టీ20లలో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో దారుణమైన వైఫల్యాలతో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి బాట పట్టిన టీమిండియా.. ఆ తర్వాత ఆడిన ఏ ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా ఓడలేదు. వరుసగా 12 మ్యాచులు గెలిచిన రోహిత్ సేన.. ఐసీసీ టీ20 పురుషుల ర్యాకింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో.. భారత జట్టు 270 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 265 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 261 పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి.
🔹 Top spot retained
🔹 Changes in the No.4, 5, 6 spots
🔹 Number of ranked teams reduced
The annual update to the @MRFWorldwide ICC Men’s T20I Team Rankings is here 👇https://t.co/mxOrPyaKPz
— ICC (@ICC) May 4, 2022
రోహిత్ భారత సారథి అయ్యాక అతడు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోలేదు. దీంతో భారత జట్టు టీ20లలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంది. ప్రపంచ ఛాంపియన్లు (2021) ఆస్ట్రేలియా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక వన్డేల్లో న్యూజిలాండ్ (125 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు (105 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక, టీ20ల్లో నెంబర్ వన్ పొజిషిన్‌లో ఉన్న రోహిత్ సేన.. లాంగ్ ఫార్మాట్ టెస్టులలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 128 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. 119 పాయింట్లతో ఇండియా రెండో స్థానానికి పరిమితమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్లు న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచారు. యాషెస్ ను 4-0తో దక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పాక్ తో ఆడిన మూడు టెస్టుల సిరీస్ లో 1-0 తో విజేతగా నిలవడంతో ఆ జట్టు అగ్రస్థానానికి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, ICC Test Rankings, New Zealand, Rohit sharma, Team India