టీ-20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ముగిసింది. ఈ మెగాటోర్నీ ముగిసిన రెండు రోజులకే ఐసీసీ (ICC) వచ్చే దశాబ్ద కాలానికి ప్రధాన టోర్నీల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మెగాటోర్నీలకు వివిధ దేశాలన్ని ఎంపిక చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇక, భారత్ కు అత్యధికంగా మూడు సార్లు ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశమిచ్చింది ఐసీసీ. వచ్చే పదేళ్లలో 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికల్ని ప్రకటించింది. పాకిస్థాన్ లో 1996లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ మరో ఐసీసీ టోర్నీ జరగలేదు. ప్రధానంగా ఉగ్రవాదం కారణంగా విదేశీ జట్లు పాక్ లో పర్యటించేందుకు భయపడుతుండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.
2025లో జరిగే పురుషుల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ కు కట్టబెట్టింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరగనున్న ఐసీసీ టోర్నీ ఇదే. చివరిసారిగా 1996లో పాకిస్థాన్... భారత్, శ్రీలంకలతో కలిసి వన్డే వరల్డ్ కప్ నిర్వహించింది.మరో ఆసక్తికర నిర్ణయం ఏంటంటే.. అమెరికా కూడా వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. 2024లో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆమెరికా వేదికగా జరగనుంది. ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్ దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
Are you ready for the best-ever decade of men’s white-ball cricket?
Eight new tournaments announced ?
14 different host nations confirmed ?
Champions Trophy officially returns ?https://t.co/OkZ2vOpvVQ pic.twitter.com/uwQHnna92F
— ICC (@ICC) November 16, 2021
ఇక, 2026లో భారత్, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అంతేకాదు, నమీబియా వంటి దేశానికి వన్డే వరల్డ్ కప్ నిర్వహించే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ పోటీలు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియాలోనూ జరగనున్నాయి. ఇక, 2028 టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి.
ఇది కూడా చదవండి : తొలి టీ20 మ్యాచ్ జరగడం కష్టమేనా..? ఆ విషయంలో భయపడుతున్న ఆటగాళ్లు..!
2029లో చాంపియన్స్ ట్రోఫీ భారత్ లో జరగనుండగా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలకు 2030లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే చాన్స్ దక్కింది. 2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా పురుషుల వరల్డ్ కప్ కు వేదికగా నిలవనున్నాయి.
ఏ టోర్నమెంట్ ఎక్కడంటే :
1. 2024 టీ-20 వరల్డ్ కప్ : అమెరికా, వెస్టిండీస్
2. 2025 చాంపియన్స్ ట్రోఫి : పాకిస్థాన్
3. 2026 టీ-20 వరల్డ్ కప్ : భారత్, శ్రీలంక
4. 2027 వన్డే వరల్డ్ కప్ : సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా
5. 2028 టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
6. 2029 ఛాంపియన్స్ ట్రోఫి : భారత్
7. 2030 టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్
8. 2031 వన్డే వరల్డ్ కప్ : భారత్, బంగ్లాదేశ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.