ICC ANNOUNCED WOMEN WORLD CUP 2022 TICKETS RATES NEW ZEALAND TO TO HOST NEXT YEAR WORLD CUP JNK
World Cup: వరల్డ్ కప్ టికెట్ రేట్లను ప్రకటించిన ఐసీసీ.. ఫ్యామిలీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్.. ఏంటో చూడండి
క్రికెట్ వరల్డ్ కప్ టికెట్ ధరలను ప్రకటించిన ఐసీసీ (PC: ICC)
ఐసీసీ వరల్డ్ కప్ టికెట్ ధరలను తాజాగా ప్రకటించింది. న్యూజీలాండ్ వేదికగా 2022లో జరుగనున్న మహిళా వరల్డ్ కప్‌కు సంబంధించి టికెట్లలో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
కరోనా మహమ్మారి (Corona Pandemic) తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావొస్తుండటంతో ఇప్పుడిప్పుడే క్రికెట్ స్టేడియంలలో (Cricket Stadium) ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఇండియా-ఇంగ్లాండ్ (India Vs England) మధ్య 100 శాతం ప్రేక్షకులను అనుమతించారు. త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశతో పాటు పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) కూడా ప్రేక్షకులను అనుతించే అవకాశం ఉన్నది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చే దాన్ని బట్టే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లో ప్రేక్షకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ 2022లో న్యూజీలాండ్ వేదికగా జరుగనున్నది. షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగాల్సి ఉన్నది. కానీ కోవిడ్ కారణంగా మెగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ గత ఏడాది డిసెంబర్ 15న ప్రకటించింది. మార్చిన షెడ్యూల్ ప్రకారం మహిళా వరల్డ్ కప్ 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్నది. 8 దేశాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 31 మ్యాచ్‌లు 6 వేదికల్లో నిర్వహించనున్నారు. అక్లాండ్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్, దునేదిన్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మహిళ వన్డే వరల్డ్ కప్ వేదికల్లో ప్రవేశానికి గాను టికెట్ ధరలను ఐసీసీ ప్రకటించింది. పిల్లలకు 7 డాలర్లు, పెద్దలకు 17 డాలర్లుగా నిర్ణయించారు. ఇక ఐదుగురు కుటుంబ సభ్యులున్న వారికి అయితే రోజంతటికీ కలపి 45 డాలర్లుగా నిర్ణయించారు. ఫ్యామిలీ మొత్తం సరదాగా ఔటింగ్‌కి వచ్చినట్లు స్టేడియంకు వచ్చి ఎంజాయ్ చేయవచ్చని ఐసీసీ చెబుతున్నది. విడి విడి టికెట్లకు ఎక్కువ ఖర్చు చేయకుండా ఒకే టికెట్‌పై ఫ్యామిలీ మొత్త క్రికెట్ మ్యాచ్ చూడవచ్చని ఐసీసీ అంటున్నది. క్రికెట్ వరల్డ్ కప్ 2022 సీఈవో ఆండ్రియా నెల్సన్ ఈ టికెట్ రేట్లను వెల్లడించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కివీస్ ప్రేక్షకులను స్టేడియంలలోకి తీసుకొని రావడానికే అందరూ భరించగలిగే టికెట్ల ధరలను నిర్ణయించామని అన్నారు. 2000లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించామని.. తిరిగి 22 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
🚨 JUST IN 🚨
The ICC Women's Cricket World Cup, originally slated for 2021 in New Zealand, has now been rescheduled for 2022. pic.twitter.com/RMzgVYClyi
వచ్చే ఏడాది మహిళా వరల్డ్ కప్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ ఈవెంట్ కోసం న్యూజీలాండ్ క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని న్యూజీలాండ్ క్రికెట్ సీఈవో డేవిడ్ వైట్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.