• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC ANNOUNCED MATCH OFFICIALS FOR WTC FINAL RICHARD KETTLEBOROUGH NAMED AS TV UMPIRE JNK

WTC Final : మళ్లీ ఆ ఐరన్ లెగ్ అంపైరే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ లిస్ట్ ప్రకటించిన ఐసీసీ

WTC Final : మళ్లీ ఆ ఐరన్ లెగ్ అంపైరే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ లిస్ట్ ప్రకటించిన ఐసీసీ

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ వీరే..!

ఇండియన్ ఫ్యాన్స్ అనుకున్నంతా అయ్యింది.. ఏ అంపైర్ అయితే వద్దని సోషల్ మీడియా సాక్షిగా ఐసీసీని రిక్వెస్ట్ చేశారో.. అదే అంపైర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నియమించింది.

  • Share this:
    ఇండియా, న్యూజీలాండ్ (IND vs NZ) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఈ నెల 18న ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ (Southampton) వేదికగా జరుగనున్నది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఇండియా జట్టు క్వాలిఫై అయిన దగ్గర నుంచి టీమ్ ఇండియా (Team India) అభిమానులు ఒక విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ టెస్టు మ్యాచ్‌కు కచ్చితంగా న్యూట్రల్ అంపైర్లను ఐసీసీ కేటాయిస్తుంది. అదే సమయంలో కరోనా కారణంగా ఇతర దేశాల అంపైర్లు ఇంగ్లాండ్ వచ్చే వీలు లేదు కాబట్టి ఆ దేశానికి చెందిన అంపైర్లే ఈ కీలక ఫైనల్‌లో మ్యాచ్ అఫీషియల్స్‌గా ఉంటారు. దీంతో టీమ్ ఇండియాకు కలసి రాని రిచర్డ్ కెటిట్‌బరో‌ను (Richard Kettleborough) నియమించవద్దని ఫ్యాన్స్ ఐసీసీ (ICC) కోరారు. టీమ్ ఇండియా ఫ్యాన్సే కాకుండా మాజీ క్రికెటర్ల వసీం జాఫర్ వంటి వాళ్లు కూడా రిచర్డ్‌బరోను ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా నియమించవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఐసీసీ ఈవెంట్లలో ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఆడినప్పుడు కెటిల్‌బరో కనుక అంపైరింగ్ చేస్తే ఆ మ్యాచ్‌లు భారత జట్టు ఓడిపోయింది. ఈ రికార్డులను దృష్టిలో పెట్టుకునే క్రికెట్ ఫ్యాన్స్ ఆ ఐరన్ లెగ్ అంపైర్‌ను వద్దని డిమాండ్ చేశారు. తాజాగా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించింది.

    వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ అంపైర్లుగా ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లోని రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మైఖెల్ గాప్‌ను నియమించింది. అయితే టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరోను ఎంపిక చేసింది. ఈ మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్‌ను నియమించింది. ఫోర్ట్ అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్ నియమించబడ్డాడు. ఈ మేరకు ఐసీసీ అంపైర్, రిఫరీల విభాగం సీనియర్ మేనేజర్ అడ్రైన్ గ్రిఫిత్ ప్రకటన విడుదల చేశారు. 'ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంతో అనుభవం కలిగిన మ్యాచ్ అఫీషియల్స్‌ను నియమించాము. అత్యంత అనుభవం కలిగిన అంపైర్లు, రిఫరీ ఈ మ్యాచ్ బాధ్యతలు నిర్వహిస్తారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వేరే చోట కూడా టెస్టు మ్యాచ్‌లు జరగకపోవడంతో ఎలైట్ ప్యానల్‌లోని అంపైర్లను ఈ మ్యాచ్‌కు కేటాయించాము' అని గ్రిఫిత్ చెప్పాడు.



    ఇండియా, న్యూజీలాండ్ మధ్య జరుగనున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ రోజ్ బౌల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే న్యూజీలాండ్, ఇండియా జట్లు ఇంగ్లాండ్ చేరుకున్నాయి. న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. ఇండియా క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 10 నుంచి 14 వరకు ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత సౌతాంప్టన్ చేరుకోనున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు