యూఏఈ (UAE), ఒమన్ (Oman) వేదికగా అక్టోబర్ 17 నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup) ప్రారంభం కానున్నది. ఐసీసీ (ICC) ఈ మేరకు మంగళవారం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. రౌండ్ 1 మ్యాచ్‌లు ఒమన్-పపువా న్యూ గినియా మ్యాచ్‌తో ప్రారంభం కానున్నాయి. ఇక సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానుండగా.. దాయాది దేశాలు ఇండియా-పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనున్నది. రౌండ్ 1లో ఒమన్, పపువా న్యూ గినియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇందులో నుంచి 4 జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. రౌండ్1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి 22 వరకు జరుగనున్నాయి. ప్రతీ రోజు రెండు మ్యాచ్‌ల చొప్పున రౌండ్ 1 మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. మొదటి మ్యాచ్ 2.00 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుందని ఐసీసీ చెప్పింది. ఇక సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ 12లో తొలి మ్యాచ్ గ్రూప్ 1లోని ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య అక్టోబర్ 23న అబుదాబి వేదికగా మధ్యాహ్నం 2.00 గంటలకు (యూఏఈ టైం) ప్రారంభం కానున్నది. అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక గ్రూప్ 2లో తొలి మ్యాచ్ ఇండియా(India)-పాకిస్తాన్(Pakistan) మధ్య సాయంత్రం 6.00 గంటలకు (ఇండియాలో రాత్రి 7.30 గంటలకు) ప్రారంభం అవుతుంది. పురుషుల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ అబుదాబి వేదికగా నవంబర్ 10న సాయంత్రం 6.00 గంటలకు, రెండో సెమీఫైనల్ దుబాయ్‌లో నవంబర్ 11న సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కూడా ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో నవంబర్ 14న జరుగనున్నది.
రౌండ్ 1 షెడ్యూల్
అక్టోబర్ 17 - ఓమన్ Vs పపువా న్యూగినియా - ఒమన్
అక్టోబర్ 17 - బంగ్లాదేశ్ Vs స్కాట్లాండ్ - ఒమన్
అక్టోబర్ 18 - ఐర్లాండ్ Vs నెదర్లాండ్ - అబుదాబి
అక్టోబర్ 18 - శ్రీలంక Vs నమీబియా - అబుదాబి
అక్టోబర్ 19 - స్కాట్లాండ్ Vs పపువా న్యూ గినియా - ఒమన్
అక్టోబర్ 19 - ఒమన్ Vs బంగ్లాదేశ్ - ఒమన్
అక్టోబర్ 20 - నమీబియా Vs నెదర్లాండ్స్ - అబుదాబి
అక్టోబర్ 20 - శ్రీలంక Vs ఐర్లాండ్ - అబుదాబి
అక్టోబర్ 21 - బంగ్లాదేశ్ Vs పపువా న్యూగినియా - ఒమన్
అక్టోబర్ 21 - ఒమన్ Vs స్కాట్లాండ్ - ఒమన్
అక్టోబర్ 22 - నమీబియా Vs ఐర్లాండ్ - షార్జా
అక్టోబర్ 22 - శ్రీలంక Vs నెదర్లాండ్స్ - షార్జా
సూపర్ 12 గ్రూప్ 1 మ్యాచ్‌లు
అక్టోబర్ 23 - ఆస్ట్రేలియా Vs సౌతాఫ్రికా - అబుదాబి
అక్టోబర్ 23 - ఇంగ్లాండ్ Vs వెస్టిండీస్ - దుబాయ్
అక్టోబర్ 24 - ఏ1 Vs బీ2 - షార్జా
అక్టోబర్ 26 - సౌతాఫ్రికా Vs వెస్టిండీస్ - దుబాయ్
అక్టోబర్ 27 - ఇంగ్లాండ్ Vs బీ2 - అబుదాబి
అక్టోబర్ 28 - ఆస్ట్రేలియా Vs ఏ1 - దుబాయ్
అక్టోబర్ 29 - వెస్టిండీస్ Vs బీ2 - షార్జా
అక్టోబర్ 30 - సౌతాఫ్రికా Vs ఏ1 - షార్జా
అక్టోబర్ 30 - ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా - దుబాయ్
నవంబర్ 1 - ఇంగ్లాండ్ Vs ఏ1 - షార్జా
నవంబర్ 2 - సౌతాఫ్రికా Vs బీ2 - అబుదాబి
నవంబర్ 4 - ఆస్ట్రేలియా Vs బీ2 - దుబాయ్
నవంబర్ 4 - వెస్టిండీస్ Vs ఏ1 - అబుదాబి
నవంబర్ 6 - ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్ - అబుదాబి
నవంబర్ 6 - ఇంగ్లాండ్ Vs సౌతాఫ్రికా - షార్జా
సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లు
అక్టోబర్ 24 - ఇండియా Vs పాకిస్తాన్ - దుబాయ్
అక్టోబర్ 25 - అఫ్గానిస్తాన్ Vs బీ1 - షార్జా
అక్టోబర్ 26 - పాకిస్తాన్ Vs న్యూజీలాండ్ - షార్జా
అక్టోబర్ 27 - బీ1 Vs ఏ2 - అబుదాబి
అక్టోబర్ 29 - అఫ్గానిస్తాన్ Vs పాకిస్తాన్ - దుబాయ్
అక్టోబర్ 31 - అఫ్గానిస్తాన్ Vs ఏ2 - అబుదాబి
నవంబర్ 2 - పాకిస్తాన్ Vs ఏ2 - అబుదాబి
నవంబర్ 3 - న్యూజీలాండ్ Vs బీ1 - దుబాయ్
నవంబర్ 2 - ఇండియా Vs అఫ్గానిస్తాన్ - అబుదాబి
నవంబర్ 5 - న్యూజీలాండ్ Vs ఏ2 - షార్జా
నవంబర్ 5 - ఇండియా Vs బీ2 - దుబాయ్
నవంబర్ 7 - న్యూజీలాండ్ Vs అఫ్గానిస్తాన్ - అబుదాబి
నవంబర్ 7 - పాకిస్తాన్ Vs బీ1 - షార్జా
నవంబర్ 8 - ఇండియా Vs ఏ2 - దుబాయ్
Mark your calendars ?
Get ready for the 2021 ICC Men’s #T20WorldCup bonanza ?
— ICC (@ICC) August 17, 2021
నవంబర్ 10 - తొలి సెమీ ఫైనల్
నవంబర్ 11 - రెండో సెమీఫైనల్
నవంబర్ 14 - ఫైనల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.