ICC ALL TIME ODI BATTERS RANKINGS PAKISTAN CAPTAIN BABAR AZAM SURPASS CRICKET LEGEND SACHIN TENDULKAR IN ICC ALL TIME ODI RANKINGS SJN
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను దాటేసిన పాకిస్తాన్ క్రికెటర్... ఎందులో అంటే?
సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫోటో)
Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు ప్లేయర్ దాటేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ర్యాంకింగ్స్ లో సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు.
Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు ప్లేయర్ దాటేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ర్యాంకింగ్స్ లో సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. సచిన్ రిటైర్ అయ్యి చాలా ఏళ్లు అయింది... ర్యాంకింగ్స్ లో బాబార్ ఆజమ్ ఇప్పుడు అధిగమించడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే చదవండి. ఇవీ ఐసీసీ (ICC) ప్రకటించే రెగ్యులర్ ర్యాంకింగ్స్ కాదు. ఐసీసీ ఆల్ టైమ్ వన్డే ర్యాంకింగ్స్ లో సచిన్ ను బాబర్ ఆజమ్ దాటేశాడు. ఆల్ టైమ్ ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో అద్భుతంగా ఆడిన ప్లేయర్స్ కు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో వరుస సెంచరీలతో అదరగొట్టిన బాబర్ ఆజమ్ ఆల్ టైమ్ వన్డే ర్యాంకింగ్ మెరుగుపడింది. ప్రస్తుతం అతడు 891 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు. ఇక 887 పాయింట్లతో సచిన్ టెండూల్కర్ 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో నంబర్ వన్ గా వెస్టిండీస్ దిగ్గజం సర్ వీవ్ రిచర్డ్స్ 935 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 911 రేటింగ్స్ తో ఆరో స్థానంలో ఉండగా... టీమిండియా కొత్త సారథి రోహిత్ శర్మ (885 రేటింగ్స్)తో 18వ స్థానంలో ఉన్నాడు.
ఇంతకీ ఏంటి ఈ ఆల్ టైమ్ ర్యాంకింగ్స్
20 మంది బ్యాటర్స్ తో కలిపి ఐసీసీ ఆల్ టైమ్ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఆడే ప్లేయర్స్ తో పాటు మాజీ ఆటగాాళ్లకు కూడా చోటు ఉంటుంది. ఇందులో టాప్ ప్లేస్ లో వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ సర్ వీవ్ రిచర్బ్స్ ఉన్నారు. రెండో స్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ జహీర్ అబ్బాస్ (931 రేటింగ్స్)తో ఉన్నాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ చాపెల్ (921 రేటింగ్స్)తో మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి కోహ్లీ మాత్రమే ఉండగా... టాప్ 20లో మాత్రం కోహ్లీతో పాటు సచిన్, రోహిత్ కూడా ఉన్నారు. ఈ టాప్ 20 ఆల్ టైమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల నుంచి నలుగురు చొప్పున చోటు దక్కించుకోగా... భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. టాప్ 20లో ఈ ఐదు దేశాలకు చెందిన ప్లేయర్స్ మాత్రమే ఉండటం విశేషం. ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన ప్లేయర్స్ లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.