Women's World Boxing Championships : భారత మహిళల బాక్సింగ్ చరిత్రలో భారత బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. లైట్ వెయిట్ కేటగిరీ (48-50 కేజీలు) ఫైనల్లో నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్ లో నిఖత్ జరీన్ 5-0తో వియత్నాం బాక్సర్ టి తామ్ న్యూయెన్ పై ఘనవిజయం సాధించింది. 2022లో తొలిసారి ప్రపంచ చాంపియన్ గా అవతరించిన నిఖత్ జరీన్.. 2023లో తన టైటిల్ ను నిలబెట్టుకుంది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తొలి భారత మహిళా బాక్సర్ గా నిఖత్ జరీన్ నిలిచింది.
ఫైనల్ ఆరంభం నుంచే నిఖత్ జరీన్ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి రౌండ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే రెండో రౌండ్ లో వియత్నాం బాక్సర్ పుంజుకుంది. రెండో రౌండ్ ను3-2తో వియత్నాం బాక్సర్ సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో రౌండ్ లో నిఖత్ జరీన్ రెచ్చిపోయింది. మూడు నిమిషాల పాటు ప్రత్యర్థిపై పిడుగుద్దుల వర్షం కురిపించింది. దాంతో మూడో రౌండ్ తో పాటు మ్యాచ్ నిఖత్ జరీన్ వశం అయ్యింది.
Phew! That was close. My pulse was racing at the end. But…an epic day: ???????????????????? ???????????????? ???? ???????????? ???????????????????? ???????? NIKHAT ZAREEN beats Nguyen Thi Tam of Vietnam by 5⃣-0⃣ And yes, she gets a Mahindra SUV! pic.twitter.com/fOGcORTgdO
— anand mahindra (@anandmahindra) March 26, 2023
లెజండరీ బాక్సర్ మేరీ కామ్ ఏకంగా 6 సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. అయితే వరుసగా రెండు సార్లు మాత్రం చాంపియన్ గా నిలువలేదు. మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ 2023లో భారత్ కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. శనివారం భారత్ కు రెండు బంగారు పతకాలు వచ్చాయి. 81 కిలోల విభాగం ఫైనల్లో హరియాణాకు చెందిన సావిటీ బూరా 4-3తో చైనాకు చెందిన వాంగ్ లినాపై గెలుపొందింది. 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్ మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. భారత్‌కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ (రెండు సార్లు) ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ,సావిటీ బూరా కూడా చేరారు. ఆదివారం లవ్లీనా బర్గోహైన్ కూడా ఫైనల్ బౌట్ లో బంగారు పతకం కోసం తలపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Delhi, Nikhat Zareen