హోమ్ /వార్తలు /క్రీడలు /

సవాల్ చేయడం సులువు.. రింగ్‌లో గెలవడమే కష్టం : నిఖత్‌ జరీన్‌కు మేరీ కోమ్ కౌంటర్

సవాల్ చేయడం సులువు.. రింగ్‌లో గెలవడమే కష్టం : నిఖత్‌ జరీన్‌కు మేరీ కోమ్ కౌంటర్

మేరీ కోమ్ (File Photo)

మేరీ కోమ్ (File Photo)

Mary Kom on Nikhat Zareen : పురుషులకు సంబంధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించినవారిని నేరుగా చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫైర్స్‌కి పంపించాలని నిర్ణయించారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి అగస్టులో రష్యాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించినవారిని ఒలింపిక్స్ క్వాలిఫైర్స్‌కి ఎంపిక చేయాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

బాక్సర్ నిఖత్ జరీన్ చేస్తోన్న విమర్శలపై దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ స్పందించారు. ట్రయల్ పోటీల్లో పాల్గొనడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నిబంధనలు తాను మార్చలేనని.. తనకు తెలిసిందల్లా రింగ్‌లోకి దిగాక మంచి ప్రదర్శన ఇవ్వడమేనని చెప్పారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నడుచుకోవడమే తనకు తెలుసునని చెప్పారు. నిఖత్ జరీన్ అంటే తనకేమీ భయం లేదని.. ఆమెతో బాక్సింగ్ చేయడానికి తానేమీ వెనుకాడట్లేదని తెలిపారు. గతంలో నిఖత్ జరీన్‌ను చాలాసార్లు ఓడించానని.. ఇద్దరి మధ్య పోటీ నిర్వహిస్తే.. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసని అన్నారు.

నిఖత్ జరీన్‌ను నేను చాలాసార్లు ఓడించాను. అయినా సరే తను నన్ను సవాల్ చేస్తూనే ఉంది.నా ఉద్దేశం అందులో అర్థముందా? అని. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఒలింపిక్స్‌లో ఎవరు మెడల్ సాధించగలరో తెలుసు.నా పట్ల అసూయతోనే ఇదంతా చేస్తున్నారు. అలా అని నేనేమీ ఆమెకు వ్యతిరేకం కాదు. ఆమెకి నేనేమీ భయపడట్లేదు. భవిష్యత్‌లో ఆమె కూడా మంచి బాక్సర్‌గా పేరు తెచ్చుకోవచ్చు. గత 20 ఏళ్లుగా నేను బాక్సింగ్ చేస్తున్నా. సవాల్ చేయడం సులువు.. రింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడమే కష్టం.
మేరీ కోమ్,బాక్సర్

కాగా, పురుషులకు సంబంధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించినవారిని నేరుగా చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫైర్స్‌కి పంపించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి అగస్టులో రష్యాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించినవారిని ఒలింపిక్స్ క్వాలిఫైర్స్‌కి ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై బాక్సర్ నిఖత్ జరీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ పోటీలు నిర్వహించకుండా ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయడం.. మిగతా క్రీడాకారుల అవకాశాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం సెలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది.

ఇది కూడా చదవండి : మేరీ కోమ్ కోసం మమ్మల్ని బలి చేస్తారా.. : ఓ యువ బాక్సర్ ఆవేదన

First published:

Tags: Mary Kom

ఉత్తమ కథలు