ధోనీని రోల్‌మోడల్‌గా తీసుకొని జీవితంలో పైకి వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా నేటి యువ క్రికెటర్లకు ధోనీనే స్ఫూర్తి. ధోనీని చూసి.. ధోనీ లాగా ఆడలాని కలలు కంటూ దాన్ని సాకరం చేసుకున్న క్రికెటర్లూ ఉన్నారు. కొంతకాలంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరల్డ్‌కప్ బెర్త్‌పై కర్చీఫ్ వేసిన యువ ఆటగాడు ఇషాన్ కిషాన్. అతను ఎప్పుడైతే డబుల్ సెంచరీ కొట్టాడో అప్పటి నుంచి ఇషాన్ పేరు టాక్ ఆఫ్ ది క్రికెట్ కంట్రీగా మారిపోయింది. ఇక ఇవాళ కివీస్‌తో తొలి టీ20 ఫైట్ కోసం జార్ఖండ్ రాజధాని రాంచీ వచ్చిన ఇషాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇషాన్ పుట్టింది పట్నాలోనే అయిన పెరిగింది మాత్రం జార్ఖండ్‌లో. అటు ధోని స్వస్థలం కూడా జార్ఖండే. ఈ క్రమంలోనే బీసీసీఐ ఇషాన్ మాటలతో కూడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Secret behind jersey number ???? Getting the legendary @msdhoni's autograph ✍️ Favourite cuisine ???? Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi ????????????????#TeamIndia pic.twitter.com/neltBDKyiI
— BCCI (@BCCI) January 26, 2023
ధోనీనే నా దేవుడు:
18 ఏళ్ల వయసులో తొలిసారి ధోనీని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నానన్నాడు ఇషాన్ కిషాన్. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవని భావోద్వేగానికి గురయ్యాడు. తన బ్యాట్‌పై భారత మాజీ కెప్టెన్ ధోనీ సంతకం పెట్టడం జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనన్నాడు. క్రికెట్‌లో తాను ఎక్కువగా ఆరాధించేది ధోనీనే తెలిపాడు. ధోనీలా ఆటడానికి కష్టపడుతున్నానంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇషాన్ కిషాన్.
జెర్సీ నంబర్ 23 అంటే ఇష్టం:
తనకు జెర్సీ నంబర్ 23 వేసుకోవాలని ఉండేదన్నారు. అయితే కుల్దీప్ యాదవ్ వద్ద అప్పటికే అదే నంబర్ జెర్సీ ఉందని గుర్తు చేసుకున్నాడు. అందుకే అమ్మను జెర్సీ నంబర్ గురించి అడిగానని.. 32 నంబర్ తీసుకొమ్మని చెప్పిందన్నారు. అందుకే జెర్సీ నంబర్ 32 వేసుకున్నానన్నాడు. టీమిండియాకు ఆడడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పాడు ఇషాన్. ఇక ఇటివలి కాలంలో ఇషాన్ కిషన్ అద్బుతంగా రాణిస్తున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆకాశామే హద్దుగా చెలరేగాడు ఈ న్యూ జార్ఖండ్ డైనమేట్. ఏకంగా డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో అటు సెలక్టర్లకు ఇటు ప్రపంచ క్రికెట్‌కు చూపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ishan Kishan, MS Dhoni