ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రధాని చేసింది నేనే...ఇప్పుడాయన దేవుడిలా ప్రవర్తిస్తున్నారు

ఇమ్రాన్ ఖాన్‌ను తానే పాక్ ప్రధాని దేశానని...అయితే ఇప్పుడాయన గతాన్ని మరిచిపోయి తాను దేవుడన్నట్లు ప్రవర్తిస్తున్నారంటూ పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ ధ్వజమెత్తారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వచ్చి అతనితో తేల్చుకుంటానని చెప్పారు.

news18-telugu
Updated: August 12, 2020, 9:25 PM IST
ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రధాని చేసింది నేనే...ఇప్పుడాయన దేవుడిలా ప్రవర్తిస్తున్నారు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన ఇమ్రాన్ ఖాన్ కారణంగానే దేశంలో క్రికెట్ నాశనమైందని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్‌ను తానే పాక్ ప్రధాని చేశానని...అయితే ఇప్పుడాయన దేవుడిలా వ్యవహరిస్తున్నారంటో తన సొంత అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మండిపడ్డారు. క్రికెట్ ఆడే రోజుల్లోనూ ఇమ్రాన్ ఖాన్‌కు తానే అండగా నిలిచి ప్రోత్సహించానని చెప్పుకొచ్చారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అదంతా మరిచిపోయారని మండిపడ్డారు.

తాను ఇమ్రాన్ ఖాన్‌కు కెప్టెన్‌గా ఉన్నానని...తనకు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా లేరన్నాడు. తను కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని వేళలా నీకు నేను అండగా నిలిస్తే...ఇప్పుడు నువ్వు దేవుడిలా వ్యవహరిస్తున్నావు’ అంటూ జావెద్ మియాందాద్ వ్యాఖ్యానించారు. దేశంలో నువ్వే తెలివైనవాడు అన్నట్లు నీ ప్రవర్తన ఉంది...దేశంలో ఎవరూ ఆక్స్‌ఫర్డ్ లేదా కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకోలేదన్నట్లు ఇమ్రాన్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశం గురించి పట్టించుకోవడం మానేశావంటూ ఇమ్రాన్ ఖాన్‌పై మియాందాద్ విరుచుపడ్డారు. తన ఇంటికొచ్చి నువ్వు పాక్ ప్రధానిగా వెళ్లలేదా? అని ప్రశ్నించారు.పాక్ క్రికెట్ బోర్డులో ఉన్న ఒక్క అధికారికి కూడా క్రికెట్ ఆట గురించి ఓనమాలు తెలియవని విమర్శించారు. ఆటగాళ్లకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ క్రికెట్ బోర్డులోకి బయటి వ్యక్తుల(విదేశీయులు)ను తీసుకురావడం సరికాదన్నారు. సొంత దేశానికి చెందిన వారిని విస్మరించి...విదేశీయుల వైపు ఇమ్రాన్ ఖాన్ మొగ్గుచూపడం సరికాదన్నారు.
Published by: Janardhan V
First published: August 12, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading