I LEAGUE 2021 22 HIT BY COVID 19 OUTBREAK AT LEAST SEVEN PLAYERS TEST POSITIVE GH VB
I-league: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు షాక్.. ఐ-లీగ్‌లో ఏడుగురు ప్లేయర్లకు కరోనా పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
రసవత్తరంగా సాగుతున్న ఐ-లీగ్ 2021-22 మెన్స్ ఫుట్‌బాల్ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. ఒకేసారి కనీసం ఏడుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లు కరోనా బారినపడ్డారు.
రసవత్తరంగా సాగుతున్న ఐ-లీగ్ 2021-22 మెన్స్ ఫుట్‌బాల్ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. ఒకేసారి కనీసం ఏడుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లు కరోనా బారినపడ్డారు. దీంతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు భారీ షాక్ తగిలినట్లయింది. మంగళవారం నిర్వహించిన పరీక్షల తర్వాత కనీసం ఏడుగురు ఆటగాళ్లతో సహా 10 మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలింది. కోల్‌కతాలోని బయో బబుల్‌లో కోవిడ్-19 కేసులు నమోదైన నేపథ్యంలో ఐ-లీగ్ ను రెండు వారాల పాటు వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్లలో ఐదుగురు.. మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్, శ్రీనిది డెక్కన్ ఫ్సీ ప్లేయర్లలో ఒకరు చొప్పున కోవిడ్-19 బారిన పడినట్లు పరీక్షలలో తేలింది. ప్లేయర్లకు కరోనా సోకినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది.
ఈ ఫుట్‌బాల్ లీగ్ ఆదివారం ఆరంభమయ్యింది. ఈ లీగ్ కోసం ఫుట్‌బాల్ నిర్వాహకులు మూడు బయో బబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ మూడు బయో బబుల్స్‌లో ఒకటైన నోవాటెల్ హోటల్లో కరోనా కలకలం సృష్టించింది. ఈ హోటల్లో ఆర్కేఎఫ్సీ, శ్రీనిది డెక్కన్, మహమ్మదీన్ స్పోర్టింగ్లతో పాటు రాజస్థాన్ యునైటెడ్, ఐజ్వాల్ ఎఫ్‌సీ, నెరోకా బస చేస్తున్నాయి. దీనితో ఆ జట్ల ప్లేయర్లకు కూడా కరోనా భయం పట్టుకుంది. ప్రస్తుతం వారికి కూడా కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహిస్తున్నారు. లీగ్‌ను కొనసాగించాలా లేదా సస్పెండ్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి లీగ్ కమిటీ ఇప్పటికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
There have some positive cases reported among certain #HeroILeague teams. The League is keeping a close tab on it and have already spoken to the clubs. In addition, an emergency meeting of the League Committee has also been summoned in the afternoon. Further details soon. pic.twitter.com/QZwfRppxDm
"భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి మేం సాయంత్రం 4 గంటలకు లీగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మాకు ఆటగాళ్లు, అధికారుల భద్రతే ముఖ్యం" అని ఐ-లీగ్ సీఈఓ సునందో ధర్ తాజాగా పేర్కొన్నారు. ఐతే ధార్ పాజిటివ్ కేసుల సంఖ్యను వెల్లడించలేదు. ఐ-లీగ్ అధికారిక హ్యాండిల్ కూడా ట్వీట్ చేసింది కానీ ఎంతమంది ప్లేయర్లకు కరోనా వచ్చిందో వెల్లడించలేదు.
ఈ ఏడాది ఐ-లీగ్‌లో మొత్తం 13 జట్లు కోల్‌కతాలోని మోహన్ బగాన్ మైదానం, కళ్యాణిలోని కళ్యాణి, నైహతిలోని నైహతి స్టేడియంలలో పోటీపడుతున్నాయి. ఆర్కేఎఫ్సీ యజమాని సందీప్ తన జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలినట్లు అంగీకరించారు.
కానీ ఎంతమందికి సోకింది మాత్రం చెప్పలేదు. నోవాటెల్ హోటల్లో ఉన్న మొత్తం ఆరు జట్ల ప్లేయర్లకు కరోనా వచ్చినట్లు అనుమానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వల్ల కొన్ని మ్యాచ్‌లు వాయిదా పడవచ్చని కానీ ఐ-లీగ్ కొనసాగుతుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. బుధవారం ఎలాంటి మ్యాచ్‌ల షెడ్యూల్స్ లేవు. కానీ శ్రీనిది, మహమ్మదీన్ స్పోర్టింగ్, నెరోకా, ఐజ్వాల్ ఎఫ్‌సీ జట్లు గురువారం మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శుక్రవారం ఆర్కేఎఫ్సీ మ్యాచ్ ఉంది.
ఐ-లీగ్ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లు, అధికారులు హోటళ్లలో ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఆ ఆరు రోజుల్లో వారికి రెండుసార్లు పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను హోటల్లోని వివిధ అంతస్తులలో ఒంటరిగా ఉంచుతారు. ఈ వ్యక్తులు మళ్ళీ టీంలో జాయిన్ కావాలంటే మూడు సార్లు కరోనా నెగిటివ్‌గా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.