హైదరాబాద్‌లోనే ఐపీఎల్ ఫైనల్..విశాఖ వాసులకూ గుడ్‌న్యూస్

మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లను విశాఖలో జరుగుతాయి. విశాఖకు బదులు చెన్నైలో మే 7న క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరుగుతుంది.

news18-telugu
Updated: April 22, 2019, 7:53 PM IST
హైదరాబాద్‌లోనే ఐపీఎల్ ఫైనల్..విశాఖ వాసులకూ గుడ్‌న్యూస్
మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లను విశాఖలో జరుగుతాయి. విశాఖకు బదులు చెన్నైలో మే 7న క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరుగుతుంది.
  • Share this:
హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్- 2019 ఫైనల్ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి బదులు హైదరాబాద్‌లోనే పొట్టి క్రికెట్ ఆఖరి పోరు నిర్వహిస్తారని సమాచారం. అటు విశాఖపట్టణంలోనూ రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు సాగర తీరాన నిర్వహించనున్నారు.  ఇదే జరిగితే.. ఐపీఎల్‌లో మూడు కీలక మ్యాచ్‌లను చూసే అదృష్టం తెలుగు క్రీడాభిమానులను వరించబోతున్నమాట..!

వాస్తవానికి గత సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టు హోంగ్రౌండ్‌లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలి. దాన్ని బట్టి గత ఏడాది టైటిల్ గెలిచిన చెన్నై..ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఐతే చెపాక్ స్టేడియంలోని I, J, K స్టాండ్స్‌ని తెరిచేందుకు తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) అనుమతివ్వలేదు. దాంతో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన  హైదరాబాద్‌లో మే 12న ఐపీఎల్ ఫైనల్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన జట్టు హోంగ్రౌండ్‌లో నిబంధనల ప్రకారం ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. దీని ప్రకారం హైదరాబాద్‌లో ఆ మ్యాచ్‌లు జరగాలి. మే 6, 10, 14న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలీసు బలగాలు అందుబాటులో ఉండటం లేదు. భద్రత పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లను విశాఖకు తరలిస్తున్నారు. మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లను విశాఖలో జరుగుతాయి. విశాఖకు బదులు చెన్నైలో మే 7న క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరుగుతుంది.First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు