హోమ్ /వార్తలు /క్రీడలు /

Hyderabad News: హైదరాబాద్ మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చేసిన GHMC అధికారులు, TRS కార్యకర్తలు

Hyderabad News: హైదరాబాద్ మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చేసిన GHMC అధికారులు, TRS కార్యకర్తలు

Hyderabad News: జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు, టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు కలిసి హైదరాబాద్ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి (Bhogi Shravani) ఇంటిని కూల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. సికింద్రాబాద్ (secunderabad)లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అతడి తండ్రి బి. మల్లేశ్ తో కలిసి నివాసం ఉంటున్నారు.

ఇంకా చదవండి ...

Hyderabad News: జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు, టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు కలిసి హైదరాబాద్ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి (Bhogi Shravani) ఇంటిని కూల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. సికింద్రాబాద్ (secunderabad)లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అతడి తండ్రి బి. మల్లేశ్ తో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఆమె ఉంటున్న ఇల్లు ఏ క్షణంలో అయినే కూలిపోయే ప్రమాదం ఉందంటూ బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇందులో  టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయంపై బాధితురాలు శ్రావణి తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే... ఆ విషయం సివిల్ వ్యవహారమని కోర్టుకు వెళ్లాల్సిందిగా శ్రావణి పేర్కొన్నారు.

శ్రావణి తండ్రి మల్లేశ్ ప్లంబర్ గా పనిచేస్తున్నారు. ఇంటిని కూల్చివేయడంతో శ్రావణి, ఆమె తండ్రి, శ్రావణి పెంచుకుంటున్న రెండు డాగ్స్ తో పాటు ఇంటికి ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటనపై శ్రావణి మాట్లాడుతూ తన అమ్మ వాళ్ల కుటుంబం తన తండ్రికి ఆ ఇంటిని ఇచ్చినట్లుగా పేర్కొంది. గత 35 ఏళ్లుగా తాము అక్కడే నివాసం ఉంటున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ’ మా ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందంటూ కొన్ని రోజుల క్రితం మాకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసు వచ్చింది. మేం దానిని ఫిక్స్ చేశాం కూడా. అయితే ఆ గోడను చెక్ చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు రాలేదు. కానీ, బుధవారం ఒక్కసారిగా  ఇంటిపై పడ్డారు. వస్తువులను బయట పడేసి చూస్తుండగానే ఇంటిని కూల్చేశారు.‘ అని శ్రావణి పేర్కొంది. ఇంకా మాట్లాడుతూ ’ మా ఇంటిపై ఎప్పటి నుంచో మా అమ్మ తరఫు బంధువులు శ్రీనివాస్ కళ్యాణ్, జానకిరామ్ కళ్యాన్ కన్నేశారు. వారిద్దరు కూడా  టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ టి. పద్మా రావు గౌడ్ కుమారుడు రామేశ్వర్ గౌడ్ కు ఫ్రెండ్స్. రాజకీయ అండతో మా ఇంటిని ఈ విధంగా కూల్చివేశారు‘ అని శ్రావణి ఆరోపించారు.

ఇక శ్రావణి తండ్రి మల్లేశ్ మాట్లాడుతూ ఇంటిని కూల్చి వేసే సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారని... అయితే వారు తమకు ఎటువంటి సాయం చేయలేదని పేర్కొన్నారు. తాము ఇక్కడే 35 ఏళ్లుగా ఉంటున్నామని... ఇంతకాలం తమ ఇల్లు ప్రమాదకరం కానిది... ఇప్పుడు ఎలా అయిందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15 నుంచి పుదుచ్చేరి వేదికగా జరిగే మహిళల టి20 టోర్నమెంట్ లో తాను పాల్గొనాల్సి ఉందని... అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? లేక తన ఇంటి కోసం పోరాడాలో తెలియట్లేదని శ్రావణి బాధ పడింది. ’క్రికెటే జీవితంగా బతుకుతున్నా... ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.

First published:

Tags: Crime news, Hyderabad, Police station, Secunderabad

ఉత్తమ కథలు